తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు

Apr 5 2025 12:15 AM | Updated on Apr 5 2025 12:15 AM

తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు

తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు

శ్రీరంగరాజపురం : తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజుని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీరంగరాజపురం మండలం డీఆర్‌ఆర్‌ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందడిని అతడి కొడుకు నాగరాజు బుధవారం రాత్రి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం డీఆర్‌ఆర్‌ పురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉండగా నాగరాజును అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎస్‌ఐ సుమన్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement