
సమన్వయంతో నగరాభివృద్ధి
చిత్తూరు కలెక్టరేట్ : అన్ని వర్గాల ప్రజల సమన్వయంతో నగర అభివృద్ధికి చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నామని చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ జిల్లా అధ్యక్షుడు తాండవమూర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలను గుర్తించేందుకు తమ సంఘం చర్యలు చేపడుతోందన్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లల్లో మూత్రశాలల నిర్మాణానికి స్థలాలను గుర్తించి కమిషనర్‌కు పంపినట్లు తెలిపారు. సొసైటీ జిల్లా కార్యదర్శిగా పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల ప్రొపెసర్ గోపీనాయక్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఎస్సై మురళిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సత్య, చంద్రబాబు, కేశవరెడ్డి, శ్రీనివాసబాబు, చంద్ర, నాగేంద్ర, శాంత పాల్గొన్నారు.