
వేడుకగా పుష్పపల్లకి
చిత్తూరు పట్టణంలోని అగస్తీశ్వర స్వామి ఆలయంలో శనివారం వేడుకగా పుష్పపల్లకి నిర్వహించారు.
సగం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిల్
చిత్తూరు కార్పొరేషన్ : రెండో శనివారం ప్రభుత్వ సెలవురోజు అయినప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తెరిచారు. కానీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. జిల్లాలో మొత్తం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో సగం కార్యాలయాల్లో బోణి కూడా అవ్వలేదు. ఉదయం నుంచి ఉద్యోగులు వేచి ఉన్నా ఎవరు కార్యాలయం వైపు రాలేదు. జిల్లాలో మొత్తం 43 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యధికంగా పలమనేరులో 21 డాక్యుమెంట్ల ద్వారా రూ.4.06 లక్షలు, పుంగనూరులో 12 డాక్యుమెంట్ల నుంచి రూ.3.15 లక్ష లు, చిత్తూరు అర్బన్‌లో ఎనిమిదింటికి రూ. 1.59 లక్షలు, బంగారుపాళ్యం రెండింటికి రూ.7850 ఆదాయం వచ్చింది. కాగా చిత్తూరు రూరల్స్, కుప్పం, కార్వేటినగరం, నగరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు.
వేణుగోపాలుడిగా కోదండరాముడు
కాణిపాకం: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు నగరంలో వెలసిన శ్రీకోదండరామస్వామి ఆలయంలోని స్వామి వారు శనివారం వేణుగోపాలుడిగా అభయమిచ్చారు. మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఉదయం ఉత్సవమూర్తిని సుందరమయంగా అలంకరించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారు వేణుగోపాలుడిగా దర్శనమిచ్చారు. నగరవీధుల్లో ఊరేగారు. రాత్రి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు భక్తిప్రపత్తులతో తరించారు.
దోపిడీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
చిత్తూర్ అర్బన్ : చిత్తూరు నగరంలో గత నెల జరిగిన దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంరెడ్డిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాంధీ రోడ్డు కూడలిలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో గత నెల 12న ఏడుగురు నిందితుల ముఠా దోపిడీకి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. వీళ్లను పట్టుకోవడానికి చిత్తూరులోని పదుల సంఖ్యలో పోలీసులు.. ఆక్టోపస్ బలగాలు రావడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. కాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను గతనెల అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంరెడ్డికి కాళ్లు విరగడంతో అతడిని నెల రోజులుగా ఆసుపత్రిలో ఉంచి ౖచికిత్స అందించారు. తాజాగా సుబ్రహ్మణ్యంరెడ్డి కోలుకోవడంతో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు.
– 8లో