
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రొంపిచెర్ల : పూతలపట్టు మండలం బండపల్లె వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రొంపిచెర్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జాహిద్ (22) మృతి చెందాడు. దీంతో విద్యార్థి స్వగ్రామం ఫజులుపేటలో విషాదం అలుముకుంది. ఫజులుపేటకు చెందిన మహబూబ్‌బాషా కుమారుడు ముత్తిరేవుల వద్ద ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కళాశాలలో శనివారం జరుగుతున్న కార్యక్రమానికి ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల నుంచి బయలుదేరగా బండపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి జాహిద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సెల్‌ఫోన్ దొంగ పట్టివేత
శ్రీరంగరాజపురం : సెల్‌ఫోన్ దొంగను స్థానికులు పట్టుకున్న సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట కూరగాయల సంతలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు 49 కొత్తపల్లిమిట్టలో ప్రతి ఆదివారం కూరగాయల సంత జరుగుతుంది. ఈ సంతకు శ్రీరంగరాజపురం, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో ప్రతి వారం సెల్‌ఫోన్ దొంగతనాలు జరిగేవి. ఆదివారం సాయంత్రం ఓ వృద్ధుడు నుంచి ముగ్గురు నిందితులు సెల్‌ఫోన్ దొంగలించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సెల్‌ఫోన్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంత నిర్వహించే ప్రదేశంలో పోలీసులతో నిఘా ఏర్పాటు చేయాలని సంత నిర్వాహకులు, ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి