
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
● పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ● రాజ్యాంగ నిర్మాతను యువత ఆదర్శంగా తీసుకోవాలి
వెదురుకుప్పం: కనికాపురంలో నేల కొరిగిన వృక్షం
అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్
శ్రీరంగరాజపురం: అంబేడ్కర్ ఆశయ సాధనకు కట్టుబడి పేదల అభ్యున్నతికి కృషి చేస్తూ అభినవ అంబేడ్కర్‌గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శ్రీరంగరాజుపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైందన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. విజయవాడలో దాదాపు 20 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో 250 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడితే, జీర్ణించుకోలేని కూటమి ప్రభుత్వం ఆ మహానీయుడి విగ్రహంపై దాడులు చేసిన పట్టించుకోలేదన్నారు.
చౌడేపల్లె: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం నేటితరం యువత కృషి చేయాలని జెడ్పీ చైర్మ న్ శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అంబేడ్కర్ జ యంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరించారు. ఆయన మాట్లాడుతూ పే ద కుటుంబంలో జన్మించి ఉన్నత చదు వులు చదివి భారత రాజ్యాంగకర్తగా నిలిచా రన్నా రు. ఆయన పేదల అభ్యున్నతికి కృషి చే సిన మహనీయులన్నారు. ఆదర్శంగా తీసు కోవా లని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు దా మోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, ఎంపీటీసీ సభ్యు లు శ్రీరాములు, లక్ష్మీనర్సయ్య, ఎంపీడీఓ లీలామాధవి, సూపరింటెండెంట్ షబ్బీ ర్ అహమ్మద్, ఈఓపీఆర్డీ కృష్ణవేణి పాల్గొన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పుత్తూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం కావాలంటే మళ్లీ జగనన్న సీ ఎం కావాల్సిందేనని మాజీ మంత్రి, వైఎ స్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు ఆర్కే రోజా స్పష్టం చేశారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని పుత్తూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మా ట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంబేడ్కర్ స్ఫూర్తితో పరిపాలన సాగించారన్నారు. నేటి కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ దళిత నాయకులు లక్ష్మణమూర్తి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్, సుబ్రమణ్యం, శివ, వేలాయుధం, రాంబత్తయ్య, గంగాధరం, రామ్మూర్తి, మస్తాన్, ఉదయ్, బాబు, ప్రభు, బొజ్జయ్య, పార్టీ నాయకులు మాహీన్, ఏకాంబరం, అన్నాలోకనాథం, భాస్కర్‌యాదవ్, చిరంజీవియాదవ్, మురళీయాదవ్, భాస్కర్‌యాదవ్, ప్రసాద్, గోపి, మునిరత్నం, చిన్నా, మురళీరెడ్డి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం
చిత్తూరు కార్పొరేషన్: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్ రాజ్యాంగం మేరకు పాలన సాగించారని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మార్చారని విమర్శించారు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావించారని మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి తెలిపారు. జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి రజనీకాంత్, పార్టీ గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, కార్పొరేటర్ లక్ష్మణ స్వామి, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, నాయకులు జ్ఞానజగదీష్, సూర్యప్రతాప్‌రెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి, ఆను, మధుసూదన్‌రాయల్, రాజేంద్ర, త్యాగ, రాబర్ట్, స్టాండ్లీ, ప్రసాద్, గిరిధర్‌రెడ్డి, ప్రేమ్, అల్తాఫ్, చాన్‌బాషా, నారాయణ, సాల్మన్, ఇరువారం ప్రేమ్, ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.