
భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
పాలసముద్రం : మండల పరిధిలోని రైతుల భూసమస్యలపై వీఆర్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కులశేఖర్‌నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఓలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఆర్‌ఓలతో రీసర్వే, రెవెన్యూ సదస్సులు రైతుల వద్ద నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్నింటిని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. శ్రీకావేరిరాజుపురం వీఆర్‌ఓ తంగరాజ్ రెవెన్యూ సదస్సు, రీ సర్వేలో వచ్చిన అర్జీలు ఎన్ని పరిష్కరించారని అడిగితే సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో ఆయనపై మండిపడ్డారు. నోస్నల్ ఖాతాల్లో పడిన సర్వే నంబర్‌లను రైతుల వద్ద నుంచి పత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌ఆర్ దేవి, వీఆర్‌ఓ శ్రీనివాసులు, రమణయ్య, రమేష్ పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పుత్తూరు : మండల పరిధిలోని పరమేశ్వరమంగళం గ్రామ సచి వాలయ వద్ద జా తీయ రహదారి పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఓబయ్య తెలిపారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ నడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. మృతుడి వయస్సు (60) ఉంటుందని, తెలుగు రంగు షర్ట్, పంచ ధరించి ఉన్నాడని తెలిపారు. కడుపు కుడి, ఎడమల వైపు నల్లటి పుట్టు మచ్చ లు ఉన్నాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు
పుంగనూరు : వివిధ ప్రాంతాలలో సారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఎకై ్సజ్ సీఐ సురేష్ తెలిపారు. మండలంలోని పెద్దతండా సమీపంలో సారా విక్రయిస్తున్న పద్మను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నా రు. అలాగే పట్రపల్లె సమీపంలో సారా విక్రయిస్తున్న రమణా నాయక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే గ్రామానికి చెందిన తిప్పానాయక్ ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. అ లాగే సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న వెంకట రమణారెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ దాడుల్లో చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జవహర్‌బాబు, ఇన్‌స్పెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది ఢిల్లీబాబు, సుబ్రమణ్యంగౌడు, నాగరాజు, సురేంద్రబాబు, వినోద్, శ్వేత, మమత, నరేంద్రరెడ్డి, దశరథ, రాజేశ్వరి పాల్గొన్నారు.