
● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్
చిత్తూరు కార్పొరేషన్ : వక్ఫ్‌బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంతోషకరమని ముస్లింలు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ‘షుక్రియ జగన్ భయ్యా’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. మైనార్టీ నాయకులు చాంద్‌బాషా, నౌషద్, నవాజ్, అల్తాఫ్, చాపు, చామంతి, ఇమ్రాన్, అక్రం, ఖాదర్, షరీఫ్, సాదిక్, జలాలుద్దీన్, హుస్సేన్, అఫ్జల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
●
అణగదొక్కే ప్రయత్నం
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణగదొక్కాలని చూస్తోంది. ఎప్పుడు మా విషయంలో వారు వ్యతిరేకంగానే ఉంటున్నారు. అప్పట్లో ఎన్‌ఆర్‌సీ అంటూ వేధింపులకు గురిచేశారు. దేశంలోని 9.40 లక్షల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది. టీడీపీ వారికి మద్దతు పలకడం అన్యాయం. – మహ్మద్‌షఫీ,
న్యాయవాది, వైఎస్సార్‌సీపీ నాయకుడు
ఆస్తులపై కన్నేశారు
పూర్వీకులు దానం చేసిన భూములపై కేంద్రం తమ అధీనంలో తీసుకోవాలని చూడటం నేరం. ముస్లింలు అంటే బీజేపీకు నచ్చదు. కానీ వారి ఆస్తులపై కన్నేశారు. వక్ఫ్ బిల్లు సవరణకు టీడీపీ మద్దతు పలకడం ప్రజలను వంచించడమే.. బిల్లుకు టీడీపీ మద్దతు తెలుపకపోతే బాగుంటుందని ఆ పార్టీలోని ముస్లింలు ఆశించారు.
– ఆను, కోఆప్షన్ సభ్యుడు
ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ
మొదటి నుంచి మైనార్టీల పక్షపాతిగా వైఎస్సార్‌సీపీ నిలుస్తోంది. జగనన్న మాకు మద్దతుగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడం గొప్ప విషయం. వైఎస్సార్ పాలనలో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేశారు. దాంతో ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు సాధించారు. ఆయన వారసుడిగా జగనన్న నిలుస్తూ అండగా ఉంటున్నారు. – మస్తాన్‌ఖాన్, నియోజక
వర్గ అధ్యక్షుడు, మైనార్టీ విభాగం వైఎస్సార్‌సీపీ
రాజ్యాంగ విరుద్ధం
కూటమి పాలనలో ముస్లిం అంటే విలువ లేకుండా పో యింది. వక్ఫ్ బిల్లు సవరణ పై సీఎం, డిప్యూటీ సీఎంలు బీజేపీతో వ్యతిరేకించలేదు. మసీదు, దర్గా, మదరాస, సందర్శించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా..? అదే విధంగా మరణిస్తే శ్మశానంలో పూడ్చటానికి వారి అంగీకారం కావాలా. వీటిని అందరూ వ్యతిరేకించాలి. – కౌసర్, కల్చరల్ విభాగం
నియోజకవర్గ అధ్యక్షురాలు, వైఎస్సార్‌సీపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌బిల్లు చట్ట సవరణను అడ్డగోలుగా చేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు అండగా నిలిచేందుకు నడుంబిగించారు. ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. ముస్లింల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఏక పక్షంగా సవరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని విన్నవించింది. రాజ్యాంగాన్ని మార్పు చేయడం ముస్లింల హక్కులను కాలరాయడమే నినదించింది. వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులు కేంద్రం చేతుల్లోకి వెళ్లేందుకే చట్ట సవరణ చేశారని వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న వక్ఫ్ ఆస్తులను లెక్కకట్టేందుకే అని చెప్పి ముస్లిం మనోభావాలను కేంద్రం దెబ్బతిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జిల్లాలోని ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు.

● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్

● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్

● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్

● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్

● వక్ఫ్‌బిల్లు సవరణపై నిరసన ● సుప్రీంకోర్టులో వైఎస్సార్