
ఉత్తమ సామాజిక విజేతలు
ఉత్తమ విద్యార్థులను తయారు చేయడమే ఉపాధ్యాయుల బాధ్యత కాదని వారిని ఉత్తమ సామాజిక విజేతలుగా తీర్చిదిద్దాల్సి అవసరం ఉంది. రేపటి తరానికి ఉపయోగపడే స్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాముఖ్యం, ఉపయోగాలను ప్రాథమిక పాఠశాల నుంచే పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న, జరగాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన అవసరం. రసాయన వ్యవసాయం వల్ల సమాజానికి జరుగుతున్న ఆర్ధిక, ఆరోగ్య నష్టాలను విద్యార్థులకు తెలియచేసి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానాన్ని సుదుమూరు పాఠశాల విద్యార్థులు పక్కాగా అమలు చేయడం ఆనందంగా ఉంది. – వెంకటరమణ, ఈఎండీపీ కో ఆర్డినేటర్, చిత్తూరు జిల్లా