
హైదరాబాద్: చాంద్రాయణగుట్టలో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఇన్‌స్పెక్టర్ ఎం.ఎ.జావిద్ తెలిపిన వివరాల ప్రకారం...పూల్‌బాగ్‌కు చెందిన షేక్ ఇస్మాయిల్(21) 2016 ఏప్రిల్ 16న పక్కింట్లో నివాసం ఉండే 7 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో ఛార్జిïÙట్ దాఖలు చేశారు. కేసును విచారించిన సెషన్స్ జడ్జి టి.అనిత నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment