
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో దారుణం చోటు చేసుకుంది. ఓ 8 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే. ముడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆమెను వెతుక్కుంటూ కజిన్ వచ్చాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కూలీ పనికి వెళ్తుంటాడు.
లైంగిక దాడి అనంతరం ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment