ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్గొండ: 65 ఏళ్ల వృద్ధుడు, మానసికస్థితి సరిగాలేని ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పి శారీరంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్‌లో చోటు చేసుకొంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానసికస్థితి సరిగా లేని యువతి(25)కి తల్లిదండ్రులు మరణించారు. వివాహితులైన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న యువతికి అదే గ్రామానికి చెందిన ఉప్పునూతుల మల్లయ్య(65) మాయమాటలు చెప్పి శారీరంగా లోబర్చుకొన్నాడు.
15 రోజుల క్రితం యువతి రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఉంటున్న అక్క వద్దకు వెళ్లింది. యువతి శరీర ఆకృతి అనుమానస్పదంగా ఉండటంతో అక్కాబావ ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆ యువతి 7నెలల గర్భవతి అని తేలింది. దాంతో ఆ యువతిని ప్రశ్నించగా మల్లయ్య తనను లోబర్చుకొని మోసం చేశాడని తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో సోమవారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో బాధితురాలికి పరిహారం ఇప్పించి రాజీకి యత్నించారు. కానీ, ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. దాంతో సాయంత్రం బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.
చదవండి: భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..
వెంటనే చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ సైదిరెడ్డి గ్రామాన్ని సందర్శించి వాస్తవ విషయాలపై స్థానికులతో ఆరా తీసి విచారణ జరిపారు. ఉప్పునూతుల మల్లయ్యను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే తనకు ఎలాంటి పాపం తెలియదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లయ్య పేర్కొంటున్నాడు.
చదవండి: గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment