లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువకుడిని జూన్ 22న అపహరించిన కిడ్నాపర్లు అతడిని హత్య చేసి పండు నదిలో పడవేసినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 26న హత్య జరగ్గా మర్డర్ మిస్టరీని చేధించిన పోలీసులు హతుడి స్నేహితులు ఇద్దరితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. నది నుంచి మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, కిడ్నాపర్లతో కాన్పూర్ పోలీసులు కుమ్మక‍్కయ్యారని, తాము చెల్లించిన రూ 30 లక్షల సొమ్ముతో కిడ్నాపర్లు పారిపోయేలా సహకరించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సంజీత్ యాదవ్‌ను జూన్ 22న బరా ప్రాంతంలో కొందరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ ఉదంతంపై కుటుంబ సభ్యులు మరుసటి రోజు జనతానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా జూన్ 29న సంజయ్‌ను విడిచిపెట్టాలంటే 30 లక్షల రూపాయలు చెల్లించాలని కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. జులై 13న పోలీసుల సమక్షంలో తాము ఆ మొత్తాన్ని చెల్లించినా కిడ్నాపర్లు సంజీత్‌ను విడిచిపెట్టలేదని వారు పేర్కొన్నారు. డబ్బున్న సంచీని రైల్వే ట్రాక్‌పై పడవేశామని వారు చెప్పారని తెలిపారు. అయితే ఆ సంచీలో డబ్బులేదని చెప్పారు. మరోవైపు కిడ్నాపర్లకు తాము 30 లక్షలు చెల్లించామని మృతుని కుటుంబ సభ్యులు వెల్లడించడాన్ని కాన్పూర్ ఎస్పీ అపర్ణ గుప్తా తోసిపుచ్చారు. అంతడబ్బు మీకు ఎలా వచ్చిందని వారిని అడిగితే వారు సరైన సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నారు. చదవండి : శ్రావణిని చంపేశారా!?
Comments
Please login to add a commentAdd a comment