
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దూలపల్లి ఫారెస్ట్ క్వార్టర్స్‌లోని డిప్యూటీ కన్సర్ వేటర్ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ అధికారి ఇనుపనూరి ప్రకాష్ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో చెట్లను పెంచుతున్న వాటికి సంబంధించిన బిల్స్ విషయంలో లంచాలు తీసుకుంటున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడలోని ప్రకాష్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఆయన చాంబర్‌లో 10 లక్షల 50 వేల రూపాయలను అధికారులు గుర్తించారు. ప్రకాష్ కార్‌లోనూ 19 వేల 800 రూపాయల్ని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment