
బొమ్మనహళ్లి: బెంగళూరులో ఓ యువతిపై లైంగికదాడి జరిగింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కోరమంగళలోని పబ్‌కు వెళ్లింది. అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో బయలుదేరగా దారి మధ్యలో కారులో సమస్య వచ్చి ఆగిపోయింది.
దీంతో రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని లిఫ్టు అడిగి బయలుదేరింది. ఆ వ్యక్తి యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి, అత్యాచారం చేసి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న ఆమె తన స్నేహితులకు మెసేజ్ పంపడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.