
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్‌లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో హిందువుల పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు విమర్శిస్తు పోలీసులను ఆశ్రయించారు. కాగా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును స్వీకరించి న్యాయమూర్తి సాయిసుధ కేసు నమోదు చేసి విచారణ జరపాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశంతో త్రీటౌన్ ఎస్ఐ రామ్, మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై 121, 121-A, 124-A, 153, 153-A, 153-B, 295-A, 298, 505, 506 పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment