ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య | Boyfriend Commits Suicide At Girlfriends Grave | Sakshi
Sakshi News home page

ప్రియురాలి మృతి, ప్రియుడు ఆత్మహత్య

Published Sun, Oct 25 2020 1:45 PM | Last Updated on Sun, Oct 25 2020 5:14 PM

Boyfriend Commits Suicide At Girlfriends Grave - Sakshi

సాక్షి, భూపాలపల్లి: ప్రియురాలి లేని జీవితం వ్యర్థం అనుకున్నాడో యువకుడు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి అనారోగ్యంతో మృతి చెందడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆ ప్రియుడు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహదేవ్‌పూర్‌ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానికంగా నివాసం ఉంటున్న మహేశ్‌..ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఆ యువతి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి మహేశ్‌ ఆమె ఆలోచనలతోనే గడుపుతున్నాడు. చివరకు యువతి సమాధి వద్దే అతడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
(ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. బేరం కుదుర్చుచుకుని కిడ్నాప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement