![Car And Bike Road Accident At Zaheerabad Sangareddy District - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/1/car-accident.jpg.webp?itok=vwGyc0HU)
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు.
బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8నెలలు)గా పోలీసులు గుర్తించారు.కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా గుర్తించారు. మృతదేహలు జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment