
విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో అనుచిత పోస్ట్ వెలువడింది.
గురుమూర్తితోపాటు, ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా సదరు పోస్ట్ ఉందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలు తెలిపారు. దీనిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment