ఎమ్మెల్యే కొడుకు అరాచకం.. అత్యాచారం చేసి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి.. | Congress MLA Son Harassed By School Student At Rajasthan | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొడుకు అరాచకం.. అత్యాచారం చేసి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి..

Published Sat, Mar 26 2022 5:56 PM | Last Updated on Sat, Mar 26 2022 6:02 PM

Congress MLA Son Harassed By School Student At Rajasthan - Sakshi

జైపూర్‌: ఎమ్మెల్యే కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితులతో కలిసి పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో నగ్న ఫొటోలను సైతం తీశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వివరాల ప్రకారం.. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్వార్ రాజ్‌గఢ్ ఎమ్మెల్యే జోహరీ లాల్ మీనా కుమారుడు దీపక్ మీనా తన స్నేహితులతో కలిసి హల్‌ చల్‌ చేశాడు. దీపక్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు దౌసా జిల్లాలోని రైనీ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను.. మహువా-మందావర్ రోడ్‌లోని సామ్లేటి ప్యాలెస్ హోటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులు అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బాధితురాలి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేశారని ఎస్‌హెచ్‌ఓ నాథూలాల్ మీనా తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 24న చోటుచేసుకోగా తాజాగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. అయితే, అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులపై పోక్సో చట్లం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఈ ఘటన రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ఈ దాడి ఘటనపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడి చేష్టల వల్ల రాష్ట్రం మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది రాజస్థాన్‌లోని మహిళల భద్రత సంగ్ధిదంలో పడింది. ఇది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మరింత అవమానకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement