ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన ఒకటి చేటు చేసుకుంది. కొడుకుపై దాడి జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లిన తండ్రిపై దుండగులు ఇటుకలతో దాడి చేశారు. 14 ఏళ్ల తన కుమారుడిని కాపాడుకున్న ఆ తండ్రి మాత్రం దాడిలో మృతిచెందాడు. ఢిల్లీలో భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతతో జీ20 సదస్సు నిర్వహిస్తున్న వేళ ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఢిల్లీ ఓక్లా ప్రాంతంలోని సంజయ్ కాలనీ ఏరియాలో నివాసముంటున్న మహమ్మద్ హనీఫ్(38) రోజు కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో హనీఫ్ కుమారుడు తన బైక్ వీధిలోనే ఉండడంతో దాన్ని తెచ్చుకునేందుకు బయటకు వెళ్ళాడు. కానీ తన బైక్ మీద కూర్చుని కొంతమంది ఆకతాయిలు హనీఫ్ కుమారుడిని బైక్ తీసుకుని వెళ్లకుండా అడ్డుకున్నారు.
వారిని బైక్‌పై నుండి లేవమని కోరగా అందుకు వారు నిరాకరించి మైనర్ బాలుడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎదో గొడవ జరుగుతున్నట్టు గ్రహించిన హనీఫ్ హుటాహుటిన బయటకు వచ్చి కుమారుడిని రక్షించే ప్రయత్నం చేయగా ఆ ఆకతాయి మూక హనీఫ్‌పై ఇటుకలతో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన హనీఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.
ఇది కూడా చదవండి: కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు
Comments
Please login to add a commentAdd a comment