క్రైం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరిలో ఒకరు, విజయనగరంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతిలో ఒకరు మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
తూర్పుగోదావరి: ఐ.పోలవరం మండలం కొత్త మురమళ్ల లైన్‌పేట లాకులు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మురమళ్ల గ్రామానికి చెందిన లంక శ్రీనివాస్ (41)గా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస శివారులో రెండు బైకులను కారు ఢీకొన్న ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా బైకు దగ్ధమైమైంది. మరో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు.
ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా..
తిరుపతి: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన తొమ్మిదవ తరగతి విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద స్వర్ణముఖి నదిలో దిగిన అమరనాథ్ (14) ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు
ఇద్దరు మృతి..
శ్రీకాకుళం జిల్లా: వీరఘట్టం మండలం కెడకల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. నలుగురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.
సముద్రంలో ఇద్దరు యువకులు గల్లంతు..
నెల్లూరు జిల్లా: వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు. ఆదివారం ఆటవిడుపుగా 8 మంది యువకులు సముద్ర స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో నెల్లూరుకు చెందిన గోపీ మృతదేహం లభ్యం కాగా, కడపకు చెందిన హసన్ కోసం మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని నాయుడుపేట మేనకురు సెజ్‌లోని అరవిందో ఫార్మసీలో ఉద్యోగులుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment