మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య | EX Conciler Puli Swamy Assasinated In Jangaon | Sakshi
Sakshi News home page

మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య

Published Thu, Jan 28 2021 8:44 AM | Last Updated on Thu, Jan 28 2021 10:41 AM

EX Conciler Puli Swamy Assasinated In Jangaon - Sakshi

సాక్షి, జనగామ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మాజీ కౌన్సిలర్‌ను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. మాజీ కౌన్సిలర్‌ పులిస్వామి గురువారం తెల్లవారుజామున జాగింగ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని అడ్డగించారు. అనంతరం గొడ్డలితో దాడి చేశారు. ( అదృశ్యమైన నాగరాజు దారుణహత్య )

తీవ్రగాయాలపాలైన పులిస్వామి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆ వెంటనే హంతకులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స‍్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement