Anantapur Road Accident Today: Father And Son Deceased In Road Accident At Anantapur - Sakshi
Sakshi News home page

‘ఓరే హేమంతూ లేవరా...? అయ్యా లేవు ఇంటికెళ్దాం’

Published Wed, Dec 29 2021 7:18 AM | Last Updated on Thu, Dec 30 2021 6:28 AM

Father and Son Deceased in Road Accident at Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం క్రైం: జీవితాంతం కలిసి నడవాల్సిన భర్త, అపురూపంగా పెంచుకున్న బిడ్డ..కళ్లముందే నిర్జీవంగా కనిపించారు. అప్పటివరకూ తనతో మాటలు చెప్పిన వారిద్దరూ కళ్లు తెరిచి చూసేలోపు లోకాన్ని వీడారు. దీంతో ఆ మహిళ శోకసంద్రంలో మునిగిపోయింది. తనవాళ్లను తలచుకుంటూ  బోరున విలపించింది. వివరాల్లోకి వెళితే...పరుశురాముడు(44), భాగ్యమ్మ దంపతులు నగరంలోని ఉమానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి హేమంత్‌కుమార్‌(17), కొండప్ప సంతానం. పరుశురాముడు బేల్దారి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

మంగళవారం పరుశురాముడు, భాగ్యమ్మ, పెద్ద కుమారుడు హేమంత్‌కుమార్‌తో కలిసి పంపనూరు దేవస్థానానికి బైక్‌లో వెళ్లారు. దైవ దర్శనం అనంతరం ముగ్గురు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్‌ కురుకుంట సమీపంలోకి రాగానే ఓ ఐచర్‌ వాహనం రాంగ్‌రూట్‌లో వేగంగా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పరుశురాముడు, భాగ్యమ్మ, హేమంత్‌కుమార్‌ ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన పరుశురాముడు, హేమంత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా... భాగ్యమ్మ కంటికి తీవ్రగాయమైంది.  

చదవండి: (Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి)

ఎంత పని చేశావయ్యా... 
కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరిగిపోవడం. భర్త, కుమారుడు విగతజీవుల్లా కనిపించడం చూసి భాగ్యమ్మ బోరున విలపించింది. ‘ఓరే హేమంతూ లేవరా...? అయ్యా లేవు ఇంటికెళ్దాం’’ అంటూ వారిని తడుతూ విలపిస్తున్న భాగ్యమ్మను చూసి సంఘటన స్థలంలోని వారంతా కంటతడిపెట్టారు. అనంతపురం రూరల్‌ స్టేషన్‌ మహానంది, ఏఎస్‌ఐ వెంకటేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. భాగ్యమ్మను ఆస్పత్రిలో చేర్చించి కేసు నమోదు చేశారు. బైక్‌ను రాంగ్‌ రూట్‌లో ఢీకొట్టిన ఐచర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అపకుండా వెళ్లిపోగా పోలీసులు వాహనం కోసం ఆయా ప్రాంతాల్లో సీపీ ఫుటేజీలను పరిశీలించారు.   

చదవండి: (విద్యార్థిని అదృశ్యం.. ఆ యువకుడిపైనే అనుమానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement