అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం | Fire Accident At Amrabad Reserve Forest In Nagar Kurnool District | Sakshi
Sakshi News home page

అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

Published Sun, Mar 7 2021 9:25 PM | Last Updated on Sun, Mar 7 2021 9:29 PM

Fire Accident At Amrabad Reserve Forest In Nagar Kurnool District - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌: అమ్రాబాద్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన నాలుగురి పరిస్థితి విషమంగా ఉ‍న్నట్లు తెలుస్తోంది. 

అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వారు అగ్నికీలల్లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత సోమవారం రాత్రి సైతం దోమలపెంట సమీపంలో అడవికి నిప్పంటుకుంది. వెంటనే రెండు అటవీశాఖ బృందాలతోపాటు 10 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బ్లోయర్లు, డౌసింగ్‌ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించి అడవికి నష్టం వాటిల్లింది. 

చదవండి: పాకిస్తాన్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement