
విశాఖపట్నం: అమాయకులైన యువతులను ఉద్యోగాల పేరుతో దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 12 మందిని చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ బ్రోకర్ దుబాయ్ తీసుకెళ్లాడు. అక్కడ వారిని దుబాయ్ షేక్‌లకు అమ్మేశాడు.
ఆ దుబాయ్ షేక్‌లు తమను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారని, బంగారం స్మగ్లింగ్ చేయాలని బెదిరిస్తున్నారని, తమను రక్షించాలంటూ బాధితులు తమ కుటుంబీకులు, బంధువులకు వీడియో కాల్ చేస్తున్నారు. దీనిపై బాధితుల తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్రోకర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment