
అశ్విని(ఫైల్)
సాక్షి, దహెగాం(ఆదిలాబాద్): మూడేళ్లుగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికిగురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రఘపతి తెలిపిన ప్రకారం, దహెగాంకు చెందిన సింగూరపు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన బాస్కె తిరుపతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల యువతిని దూరంగా ఉంచడంతో మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా కాగజ్ నగర్‌కు అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment