
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, దండేపల్లి(ఆదిలాబాద్) : మండలంలోని కాసిపేటకు చెందిన మాదాసు పద్మ (41) అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై పాల్ కథనం ప్రకారం పద్మకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగడుతూ గ్రామానికి చెందిన దాసరి శారదా,పోషన్న, చిన్నక్క అనే ముగ్గురు రెండు నెలలుగా సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. శనివారం ఉదయం కూడా సదరు వ్యక్తులు దుర్భాషలాడుతూ పద్మపైకి దాడిచేసే ప్రయత్నం చేశారు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గడ్డి మంది తాగింది. గమనించిన కుటుంబం సభ్యులు 108 ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంచార్యాలకు రెఫర్ చేయగా అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి కొడుకు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై వెల్లడించారు.