
దామెర: సామాన్య ప్రజల ఫేస్‌బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు లాగుతున్న సైబర్ నేర గాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసులనే టార్గెట్ చేశారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీస్‌స్టేషన్ (ఎస్‌హెచ్‌ఓ) పేరుతో గతంలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచారు. అయితే, ఆదివారం రాత్రి ఈ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బు పంపాల్సిందిగా పలువురిని మెసెంజర్ ద్వారా కోరారు.
ఈ విషయాన్ని స్థానికులు కొందరు గుర్తిం చి ఎస్సై భాస్కర్‌రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఆయన తాము ఎవరినీ డబ్బు అడగలేదని, అపరిచితులు ఎవరైనా డబ్బులు అడిగితే పంపవద్దని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ అకౌంట్ హ్యాక్ అయిన విషయం వాస్తవమేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment