
ప్రతీకాత్మక చిత్రం
బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): బైక్‌పై వెళ్తున్న దంపతులపై హిజ్రాలు దాడి చేశారు. నంద్యాల పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. హోలీ పండగ ఉండటంతో పాణ్యం మండలం రాంభూపాల్‌రెడ్డి తండాకు చెందిన బాలనాయక్, హనీమాబాయి దంపతులు నిత్యావసర సరుకుల కోసం నంద్యాల పట్టణానికి బైక్‌పై బయలుదేరారు.
చదవండి: కోరిక తీర్చకపోతే నీ అంతు చూస్తా.. విద్యార్థినికి అసభ్యకర వీడియోలు పంపి..
ఆటోనగర్ శివారులో హనీ, ఆశ అనే హిజ్రాలు వారి బైక్‌ను అడ్డగించి డబ్బు అడిగారు. తన వద్ద చిల్లర డబ్బులు లేవనడంతో వారు బలవంతంగా బాలనాయక్ జేబులో చేతులు పెట్టి రూ.100 నోటు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇవ్వకపోవడంతో బైక్‌పై ఉన్న ఆ దంపతులను కిందకు తోసి వారిపై దాడి చేసి పరారయ్యరు. ఈ ఘటనలో బాలనాయక్ భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు తాళిబొట్టు గొలుసు మాయం కావడంతో వారు రూరల్ సీఐ మురళీమోహన్‌రావును కలిసి ఫిర్యాదు చేశా రు. దాడి చేసిన హిజ్రాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment