పట్టుబడిన నిందితులు
బెంగళూరు: తమ చేతిలో ఉన్న పనితో సమాజానికి మంచి చేయాల్సింది పోయి వక్రమార్గం పట్టారు ప్రబుద్ధులు. నగరంలోని రామ్మూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పా యజమానిని బెదిరించి రూ.1.60 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఆర్‌టీ నగర కావల్ బైరసంద్ర విలేకరి సయ్యద్ ఖలీం (28), పోలీస్ హోంగార్డులు అసిఫ్ (27), డి.జే.హళ్ళి సంపంగిరాం (31), ఆనంద్‌రాజ్ (30), బెన్సన్ లింగరాజపురం వినాయక్ (28) అనే నిందితులు పోలీసులు పట్టుకున్నారు.
ఏదో విధంగా డబ్బు సంపాదించాలని విలేకరితో కలిసి హోంగార్డులు ఒక స్పాకు వెళ్లారు. మీ స్పాలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. ఫిబ్రవరి 26న రూ.60 వేల నగదు, రూ. లక్షను గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. తరువాత స్పా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఐదుగురినీ అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment