home gaurds
-
హోంగార్డు రవీందర్ మృతి
సాక్షి, హైదరాబాద్: జీతం కోసం వెళ్తే అధికారులు అవమానించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గోషామహల్‌లోని హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయం వద్ద మంగళవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రవీందర్‌కు 55 శాతం కాలిన గాయాలైన విషయం తెలిసిందే. ఆయనకు తొలుత ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన చికిత్స కోసం డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతదేహాన్ని ఉస్మా నియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవీందర్ భార్య సంధ్య, కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగడంతో రోజంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేతనం కోసం వెళ్లి.. ఆందోళనకు గురై.. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హైదరా బాద్ పాతబస్తీలోని రక్షాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ (38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. తనకు జీతం రాకపోవడంతో రవీందర్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాల యానికి వెళ్లి వాకబు చేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్ చందు చులకనగా మాట్లాడటంతో రవీందర్ ఆవేదనకు లోనయ్యారు. ఆ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆస్పత్రి వద్ద ఆందోళనతో.. పోలీసులు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించగా.. ఆయన భార్య, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసు అధికా రుల వేధింపులతోనే రవీందర్ ఆత్మహత్యకు పాల్ప డ్డారని ఆరోపించారు. బాధ్యులైన ఇద్దరు పోలీసుల ను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. తన భర్త మృతిపై కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహా న్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం ఏమిటని, తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే సందేహాలు వస్తున్నాయని సంధ్య ఆరోపించారు. ఆమెకు సంఘీభావంగా రక్షాపురం బస్తీవాసులు, హోంగార్డులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరు కున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. చివరికి డీసీపీ లు సునీల్‌దత్, కిరణ్ ఖేర్, ఏసీపీ బాల గంగిరెడ్డి తదితరులు సంధ్యతో మాట్లాడి.. త్వరలో డీజీపీ వద్ద కు తీసుకెళ్లి న్యాయం చేస్తామని, పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో సంధ్య ఆందోళన విరమించారు. వైద్యులు పోస్టు మార్టం అనంతరం రవీందర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శనివారం రక్షాపురంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు రవీందర్ ఆత్మహత్యపై భార్య సంధ్య చేసిన ఫిర్యాదు మేరకు షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య ఆరోపణల మేరకు హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయంలోని ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: రాజకీయ పక్షాలు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన రవీందర్ భార్య సంధ్యకు పలువురు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు ఆమెకు బాసటగా నిలిచారు. ♦ రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.2 లక్షలు ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఇక కేఏ పాల్ రూ.3.1 లక్షల చెక్కును సంధ్యకు అందించి ఓదార్చారు. ♦ హోంగార్డు రవీందర్ ఆత్మహత్య బాధాకరమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. హోంగార్డులకు సకాలంలో జీతాలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. రవీందర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ♦ హోంగార్డు రవీందర్ మృతికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హోంగార్డులను రెగ్యుల రైజ్ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. రవీందర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: రవీందర్ మృతి.. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ ఏమైంది? -
స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై
బెంగళూరు: తమ చేతిలో ఉన్న పనితో సమాజానికి మంచి చేయాల్సింది పోయి వక్రమార్గం పట్టారు ప్రబుద్ధులు. నగరంలోని రామ్మూర్తి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పా యజమానిని బెదిరించి రూ.1.60 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఆర్టీ నగర కావల్ బైరసంద్ర విలేకరి సయ్యద్ ఖలీం (28), పోలీస్ హోంగార్డులు అసిఫ్ (27), డి.జే.హళ్ళి సంపంగిరాం (31), ఆనంద్‌రాజ్ (30), బెన్సన్ లింగరాజపురం వినాయక్ (28) అనే నిందితులు పోలీసులు పట్టుకున్నారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలని విలేకరితో కలిసి హోంగార్డులు ఒక స్పాకు వెళ్లారు. మీ స్పాలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. ఫిబ్రవరి 26న రూ.60 వేల నగదు, రూ. లక్షను గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. తరువాత స్పా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఐదుగురినీ అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. -
హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
-
ఆ హోంగార్డుల సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేసి మాతృ విభాగంలో రిపోర్టు చేసిన 400మంది హోంగార్డులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన హోంగార్డులు ఎఫ్‌సీఐ, దూరదర్శన్‌తో పాటు పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో డిప్యుటేషన్‌పై మూడేళ్లు పనిచేసి మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేశారు. వీరు రిపోర్టు చేసి 2నెలలు గడిచినా.. వాళ్లకి మళ్లీ పోస్టింగ్స్ కల్పించకపోవడం తో ఆ కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. 2 నెలల నుంచి జీతభత్యాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటివరకు వీరంతా రూ.12 వేల జీతభత్యాల మీద పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేశారు. ఇటీవలే జీతభత్యాల పెంపు రూ.20 వేలకు వెళ్లడంతో డిప్యుటేషన్‌పై హోం గార్డులను వినియోగించుకుంటున్న విభాగాలు ఈస్థాయిలో జీతాలు చెల్లించలేమని వీరందరినీ హెడ్‌క్వార్టర్స్‌కు పంపాయి. ప్రస్తుతం పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులకే రూ.20 వేలు వర్తిస్తుందని, వారి వరకే బడ్జెట్లో ప్రభు త్వం కేటాయింపులు చేసిందని చెప్పడంతో వెయింటింగ్‌లో ఉన్న హోంగార్డులు మరింత ఆందోళనలో పడ్డారు. దీనిపై తాము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఆదేశాలకు ఆలస్యమైందని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారని బాధిత హోంగార్డులు తెలిపారు. ఇప్పటికైనా వెయింటింగ్‌లో ఉన్న తమకు పోస్టింగ్స్ కల్పించి జీతభత్యాల పెంపు వర్తింపుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హోంగార్డులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నామని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు అభినందన సభ నిర్వహించారు. నాయిని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. హోంగార్డులు తమ సమస్యలంటూ ఎక్కడికి పోవద్దని.. సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులు దరఖాస్తు చేస్తే 15 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. హోంగార్డుల జీతాలు పెంచినందుకు ఈ అభినందన సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, హోంగార్డుల సంఘం నాయకులు మల్రెడ్డి, కుమారస్వామి, ఏడుకొండలు, కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నాప్ కేసులో ఇద్దరు హోంగార్డుల అరెస్ట్
విజయనగరం : భూ తగాదాలకు సంబంధించిన విషయంలో ఇద్దరు హోంగార్డులు అరెస్టు అయ్యారు. తమకు సంబంధం లేకున్నా పోలీసులమని చెప్పి బెదిరించడం తరువాత అసలు విషయం బయటపడడంతో పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... భూ తగాదాలకు సంబంధించిన విషయంలో ఇద్దరు హోంగార్డులు తాము వన్‌టౌన్ పోలీసులమంటూ బాధితుని ఇంటికి వెళ్లి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆనందపురంలో ఉంచారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి భార్య వన్టౌన్కి వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు సీసీ పుటేజీలు ద్వారా విషయం తెలుసుకుని ఘటనకు పాల్పడిన ఇద్దరు హోంగార్డులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ సీఐ పి.శోభన్‌బాబు తెలిపిన వివరాలు...స్థానిక ప్రదీప్‌నగర్‌లో నివాసముంటున్న యర్రా ఈశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈయనకు విశాఖలో ఉన్న అన్ని శ్రీనివాసరావుకు మధ్య వ్యాపార రీత్యా చాలాకాలం నుంచి గొడవలున్నాయి. అయితే ఈ నెల 5వ తేదీ రాత్రి ఇద్దరు పోలీసులు వచ్చి తాము వన్‌టౌన్ పోలీసులమని చెప్పి, ఈశ్వరరావును విచారణ నిమిత్తం తీసుకువెళ్తున్నామని చెప్పి కిడ్నాప్ చేసి విశాఖ ఆనందపురంలో ఓ ఇంట్లో బంధించారు. అయితే వన్‌టౌన్ పోలీసులమని చెప్పి తీసుకువెళ్లడంతో ఈశ్వరరావు భార్య వత్సవాయి వెంకటరత్నకుమారి పోలీసులను ఆశ్రయించింది. విషయం విన్న వన్‌టౌన్ పోలీసులు కేసుపై సత్వర దృష్టి సారించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను స్వీకరించారు. వాటి ద్వారా నిందితులను క్షణాల్లో పసిగట్టారు. వారిలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు హోంగార్డులున్నట్టు గుర్తించారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న బూర్లి శ్రీనివాస్, ఏపీఎస్పీలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న బి.లక్ష్మణరావులను అదుపులోనికి తీసుకున్నారు. కేసును సీఐ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.