
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హోంగార్డులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నామని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు అభినందన సభ నిర్వహించారు. నాయిని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. హోంగార్డులు తమ సమస్యలంటూ ఎక్కడికి పోవద్దని.. సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.
కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులు దరఖాస్తు చేస్తే 15 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. హోంగార్డుల జీతాలు పెంచినందుకు ఈ అభినందన సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, హోంగార్డుల సంఘం నాయకులు మల్‌రెడ్డి, కుమారస్వామి, ఏడుకొండలు, కృష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment