
ప్రతీకాత్మక చిత్రం
భైంసా టౌన్(ఆదిలాబాద్ జిల్లా): భార్యాభర్తల మధ్య తలెత్తిన చెప్పుల గొడవ భర్త ప్రాణాలు తీసింది. ఎస్సై హన్మండ్లు కథనం ప్రకారం.. పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన గడపాలే గంగాధర్ (45) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భైంసా సమీప గ్రామంలో శుభకార్యం ఉండడంతో భార్యాభర్తలు కొత్త చెప్పులు కొనుగోలు చేశారు.
చదవండి: ఇది మరీ ఘోరం! పెళ్లిలో భోజనం తినేటప్పుడు చూశారని..
సాయంత్రం ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్యన చెప్పుల విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య శుభకార్యానికి రానని చెప్పడంతో మనస్తాపానికి గురైన గంగాధర్ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఎంతకీ రాలేదు. దీంతో భార్య ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment