
ప్రతీకాత్మకచిత్రం
మైసూరు: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్తకు విషం ఇచ్చి హతమార్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితురాలిని, అమె ప్రియుడిని కటకటాల వెనక్కు పంపారు.హెచ్.డి.కోటె తాలూకా, అగసనహుండి గ్రామానికి చెందిన కెంపెగౌడ కుమార్తె శిల్పను పదేళ్ల క్రితం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని హుండిమాళ గ్రామంలో చెందిన లోకమణి(36)కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శిల్పకు పెళ్లికాకముందే తన ఇంటిపక్కన ఉన్న అభినందన్‌ను ప్రేమించింది. వీరి వివాహానికి శిల్ప కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
లోకమణికి ఇచ్చి వివాహం చేశారు. వివాహమైనా శిల్ప తన ప్రియుడితో సన్నిహితంగా మెలుగుతోంది. లోకమణిని అడ్డు తప్పిస్తే ఇద్దరూ సంతోషంగా ఉండవచ్చని భావించారు. లోకమణికి ఆహారంలో విషం కలిపి పెట్టారు. భోజనం అనంతరం గంట తర్వాత అతను మృతి చెందాడు. గుండెపోటు వచ్చి చనిపోయాడని అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే శిల్పలో వచ్చిన మార్పును గమనించిన లోకమణి తల్లి.. తన కుమారుడు హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శిల్ప, ఆమె ప్రియుడు అభినందన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పడింది.
చదవండి: (రూ.28 లక్షలకు సొంతిల్లు అమ్మేసి.. భార్యను ప్లాస్టిక్ కవర్‌లో సీల్ చేసి..)
Comments
Please login to add a commentAdd a comment