
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని లింగాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే లింగాపూర్‌కు చెందిన శివరాత్రి రాజ్‌కుమార్(25), అతని భార్య సంధ్య, తల్లిదండ్రులకు 15 రోజుల క్రితం కరోనా సోకింది. అందరూ ఇంట్లో క్వారంటైన్‌లో ఉండగా సంధ్య పుట్టింటికి వెళ్లింది. సోమవారం మళ్లీ కరోనా టెస్ట్‌లు చేసుకోగా అందరికి నెగెటివ్ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్ సంధ్యను తీసుకురావడానికి వాళ్ల అత్తగారింటికి వెళ్లగా తిరిగి రావడానికి సంధ్య నిరాకరించింది. మనస్తాపం చెందిన రాజ్‌కుమార్ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.
భార్యకు నయం కావడం లేదని భర్త ఆత్మహత్య
కోటపల్లి: భార్య అనారోగ్యంతో బాధపడుతుందని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రాపన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(35) అనే వ్యక్తి భార్య సుమలత గత ఆరేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స చేయించినా భార్యకు నయం కాకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన నాగరాజు మంగళవారం ఉదయం పంట చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్యాముల్ తెలిపారు.
చదవండి: భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య..
Comments
Please login to add a commentAdd a comment