అఖిల్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలోని టొరంటోలో బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్-4లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు పాణ్యం అఖిల్(19) కెనడాలోని టొరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి చేసుకుని గత మార్చి 20న నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి అక్టోబర్ 5న కెనడాకు వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారుజామున తాను ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. అతని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. (ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment