గోల్కొండ: హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కెనడాలో మృతి చెందాడు. టోలిచౌకీ బాల్‌రెడ్డినగర్‌కు చెందిన షేక్ ముజాఫర్ అహ్మద్ కుమారుడు షేక్ ముజామిల్ అహ్మద్(25). ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2022లో కెనడా వెళ్లాడు. ఒంటారియో సిటీ కిచెన్నర్‌లోని కనెస్టోగా కాలేజ్‌లో ఎంఎస్‌ఐటీ డిగ్రీ చేస్తున్నాడు. వాటర్లు క్యాంపస్‌లో ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా షేక్‌ముజామిల్ అహ్మద్ వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నాడు. కార్డియాక్ అరెస్టుతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
ఎమ్మెల్యే పరామర్శ
షేక్ ముజామిల్ అహ్మద్ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. బాల్‌రెడ్డినగర్‌లో నివసించే మృతుడి తండ్రి షేక్ ముజాఫర్ అహ్మద్‌ను ఆయన మృతుడి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకువెళ్లి మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షేక్ ముజాఫర్‌కు హామీ ఇచ్చారు. ఆయన వెంట కార్పొరేటర్ మహ్మద్ నసీరుద్దీన్, హారూన్‌ఫరాన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment