![Karnataka: Lover Attack On Girlfriend For Chatting With Others - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/24/chating.jpg.webp?itok=prvU8500)
సాక్షి, బెంగళూరు : మరో వ్యక్తితో చాటింగ్ చేస్తున్న తన ప్రియురాలిపై ప్రియుడు హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మైసూరులోని శ్రీహర్ష రోడ్డులో జరిగింది. మైసూరు జిల్లా సంజనగూడు శ్రీరాంపురానికి చెందిన సౌమ్య(26) రమేశ్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె వాట్సప్‌ను హ్యక్ చేసిన రమేశ్ ఆ మొబైల్ సందేశాలను తన సెల్‌కు వచ్చేలా చేసుకున్నాడు. కొందరు యువకులతో సౌమ్య చాట్ చేస్తున్నట్లు రమేశ్ గుర్తించాడు. దీంతో ఆమెతో లవ్ బ్రేకప్ చేసుకున్నాడు. తిరిగి మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment