attack with knife
-
ఎంపీ ప్రభాకర్ మరో 4 రోజులు ఐసీయూలోనే.. దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్‌రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలిపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు.వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసలేం జరిగిందంటే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చదవండి: Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా.. -
లండన్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ రాజధాని లండన్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని లండన్‌లో మాస్టర్స్ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా.. తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తండ్రి అనారోగ్యానికి గురవ్వగా ఆరు నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్లింది. మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి చేసి ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తన కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తేజస్వినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్? -
కాకినాడ నుంచి స్విగ్గీలో స్వీట్లు ఆర్డర్.. 3 గంటలు డెలివరీ ఆలస్యం కావడంతో
సాక్షి, హైదరాబాద్: కాకినాడ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేసిన స్వీటు.. నానక్‌రాంగూడకు డెలివరీ ఆలస్యం కావడంతో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా.. కాకినాడలో ఉండే సాయిశ్రీ స్విగ్గీలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వీట్ ఆర్డర్ చేయగా నానక్‌రాంగూడలో గోల్ప్ ఎడ్జ్ ఫ్లాట్ నెంబర్ 1804లో ఉంటున్న భాస్కర్‌కు చేరాల్సి ఉంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన షేక్ అమీర్ బైక్‌పై బయలుదేరాడు. వర్షం పడటంతో రాంగ్ లొకేషన్ చూపించడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి యువతికి ఫోన్ చేయగా డెలివరీ అడ్రస్ లొకేషన్ పంపించింది. దీంతో గోల్ప్ ఎడ్జ్‌కు చేరుకునే సరికి సాయంత్రం 6 గంటలైంది. డెలివరీ తీసుకోమని స్నేహితుడు చెఫ్ శివ ప్రసాద్‌కు చెప్పి భాస్కర్ బయటకు వెళ్లాడు. డెలివరీ ఆలస్యమైందని చెఫ్ దురుసుగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో శివప్రసాద్ ఇంట్లో నుంచి కత్తి తెచ్చి దాడి చేయగా ప్రతిఘటించిన షేక్ అమీర్ కుడి చేతిపై గాయమైంది. అమీర్ అదే కత్తిలో శివప్రసాద్ మెడ, ఛాతి, చేతిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో చెఫ్ శివప్రసాద్, డెలివరీ బాయ్ షేక్ అమీర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: స్విగ్గీలో ఐస్‌క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి -
బంజారాహిల్స్: భార్యను కత్తితో పొడిచి తానూ పొడుచుకున్నాడు
సాక్షి,బంజారాహిల్స్: ఓ వ్యక్తి భార్యను కత్తితో పొడవడమే కాకుండా తాను కూడా పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. జహీరాబాద్‌కు చెందిన సత్తమ్మ అలియాస్ పుణ్యమ్మ(50), ఆమె భర్త మానయ్య మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు తీవ్రం కావడంతో రెండు నెలల క్రితం సత్తమ్మ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని మిథిలానగర్‌లో నివసించే సోదరుడి ఇంటికి వచ్చింది. చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా! తన భార్యను తీసుకుపోయేందుకు మానయ్య కూడా రెండు రోజుల క్రితం మరదలు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో భార్య కూడా అక్కడ ఉండటంతో కోపం పట్టలేక ఆమె మంగళసూత్రాన్ని తెంపేసి అక్కడే ఉన్న కత్తితో మూడు చోట్ల పొడిచాడు. ఆమెను కాపాడేందుకు మరదలు కళావతితో పాటు చుట్టుపక్కల వారు ప్రయత్నిస్తుండగానే అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. తీవ్ర గాయాల మధ్య ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు -
జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్‌రెడ్డి మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా రవీందర్ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిపై అతని అల్లుడు మోహన్‌రెడ్డి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఉన్న సెల్‌ఫోన్ తీసుకోవడానికి రాగా అక్కడే కాపుకాసిన అతని బంధువు ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రవీందర్ రెడ్డిని సమీపంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. చదవండి: బెదిరించానని చెబితే ఖతం చేస్తా... ఘటనా స్థలంలో పోలీసులు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థిరాస్తి వ్యాపారంలో మూడున్నర లక్షల కమిషన్ విషయం గొడవకు కారణమని తెలుస్తోంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! -
గుంటూరు: అల్లుడిపై మామ, బావ మరిది కత్తితో దాడి
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి గాయపరిచిన ఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచేరువులో చోటుచేసుకుంది. వివరాలు.. దూదేకుల చిన్న కాశిం ఇటీవల చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు. చెడు వ్యసనాలను మానుకోవాలని భార్య కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతనిలో మార్పు రాలేదు. చదవండి: ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా... కొన్ని రోజుల నుంచి భార్యపై చిన్న కాశిం వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై చిన్న కాశింను అతని మామ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో చిన్న కాశింపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్న కాశింను చికిత్స కోసం పిడుగురాళ్ల ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు . మామా పిరు సాహెబ్, బావ మరిది భాషాలను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి.. -
నాలుగేళ్లుగా ప్రేమ.. వాట్సప్ హ్యక్ చేసి సీకెట్ర్గా!
సాక్షి, బెంగళూరు : మరో వ్యక్తితో చాటింగ్ చేస్తున్న తన ప్రియురాలిపై ప్రియుడు హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మైసూరులోని శ్రీహర్ష రోడ్డులో జరిగింది. మైసూరు జిల్లా సంజనగూడు శ్రీరాంపురానికి చెందిన సౌమ్య(26) రమేశ్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె వాట్సప్‌ను హ్యక్ చేసిన రమేశ్ ఆ మొబైల్ సందేశాలను తన సెల్‌కు వచ్చేలా చేసుకున్నాడు. కొందరు యువకులతో సౌమ్య చాట్ చేస్తున్నట్లు రమేశ్ గుర్తించాడు. దీంతో ఆమెతో లవ్ బ్రేకప్ చేసుకున్నాడు. తిరిగి మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: యువతితో దిగిన ఫొటోతో స్టేటస్.. భార్య చూడటంతో! -
నీళ్లకు డబ్బులు అడిగినందుకు కత్తితో దాడి
సాక్షి, సైదాబాద్: మినరల్ వాటర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ రహదారిపై అబ్దుల్ జబ్బార్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఖాలేద్ అనే యువకుడు ప్లాంట్‌కు వచ్చి నీళ్లు తీసుకున్నాడు. డబ్బులు అడుగడంతో తాను సైదాబాద్ డాన్ అని వాగ్వాదానికి దిగాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తి, నక్కల్ పంచ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన జబ్బార్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని -
‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యం’
సాక్షి, పిట్టలవానిపాలెం(గుంటూరు): ‘నన్ను చూసి నవ్వుతావంట్రాఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో గొంతు కోసిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు మండే వారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో యువకులు అందరూ కలిసి ప్రత్యేక దృశ్య రూపకం వద్ద ఉన్నారు. గ్రామానికి చెందిన జాలాది శివ (20) యువకుడు సమీపంలో మరో వ్యక్తితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారికి ఎదురుగా ఉన్న దోనెపాటి శోభన్ నన్ను చూసి నవ్వుతావంట్రా నీకు ఎంత ధైర్యం అంటూ అతనిపై కలబడ్డాడు. సమీపంలో ఉన్నవారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. అయితే శివాజీ ఇంటికి వెళ్లిపోయాడు. అతనితో పాటే శోభన్ కూడా ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని శివాజీని కడుపులో పొడిచేందుకు ప్రయత్నించగా దగ్గరలో ఉన్నవారు అతన్ని పక్కకు లాగడంతో చేతిపై కత్తిగాయం అయింది. (చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య) సమీపంలోని వారు గాయం అయిన చోట పసుపు రాస్తుండగా మరోసారి కత్తితో వచ్చి ఒక్కసారిగా గొంతుకోసి వెళ్లిపోయాడు. రక్తస్రావం అధికం కావడంతో స్థానిక యువకులు శివాజీని చందోలు పోలీసు సేష్టన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పొన్నూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాలాది శివాజీ 10 ఏళ్ల వయస్సులో తండ్రిని, 15 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి గ్రామస్తులు, బం«ధువులతో సన్నిహితంగా ఉంటూ ఆటోను అద్దెకు తీసుకుని బాడుగలు లేని సమయంలో కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. దిక్కూ మొక్కూలేని వాడని ఈ విధంగా చేస్తారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శివాజీ ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. -
పబ్జీ కోసం తండ్రిపై కత్తితో దాడి!
లక్నో: పబ్జీ గేమ్‌ను భారత్‌తో బ్యాన్ చేసిన దాని వల్ల జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గంటలు గంటలు పబ్జీ అడొద్దు అని చెప్పినందకు ఒక కొడుకు తన తండ్రిని కత్తితో గాయపరిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. అమర్ అనే వ్యక్తిని అతని తండ్రి ఇర్ఫాన్ పబ్జీ అడొద్దు అంటూ మందలించాడు. ప్రతిసారి అలా అడ్డుచెప్పడంతో విసుగుచెందిన అమర్ అతని తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి అతని గొంతు వద్ద అనేకసార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలతో వచ్చిన అతడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయాడు. గాయపడిన తండ్రి కొడుకులను ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అమర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. భారత్‌లో పబ్జీని ఆపేసినప్పటికి ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారు ఆడటానికి వీలు కల్పిస్తుండంటతో యువత పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. చదవండి: పబ్జీ ముసుగులో బాలికపై దారుణం -
పాతబస్తీలో దారుణం: కత్తిపోట్లకు దారితీసిన వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం వారిలో ఒకరి మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ కాలా పత్తార్ పరిధిలోని ఓ గుర్రపు శాల వద్ద మహ్మద్ అమీర్, సలీం మొసిన్ల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. అమీర్, మొసిన్పై కత్తితో దాడి చేయడంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే మొసిన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మొసిన్ మృతి చెందారు. విషయం తెలుసకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
చిచ్చు పెట్టిన ఫొటో
సాక్షి, రాజంపేట : అన్న, తమ్ముడి మధ్య ఓ ఫొటో చిచ్చు పెట్టింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని బీఎస్ థియేటర్ సమీపాన ఉన్న ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కరీముల్లా, షమీవుల్లా అన్నదమ్ముళ్లు. రంజాన్‌ను ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. ఇంతలోనే తమ్ముడు షమీ వుల్లా అన్న భార్య ఫొటో తీశారు. ఈ క్రమంలో అన్న కరీముల్లా అభ్యం తరం చెప్పారు. గొడవ వాతావరణం నెలకొంది. పైగా అనుమానం కలిగి ఉన్న అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన తమ్ముడిని స్థానిక పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ నరసింహులు మాట్లాడుతూ తమ్మునిపై అన్నకు అనుమానం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో ఘర్షణ చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
పిలిస్తే పలకడం లేదని.. మహిళపై కత్తితో దాడి
శృంగవరపుకోట రూరల్ : కొన్నేళ్లుగా తనతో కలిసిమెలిసి తిరిగిన వివాహిత మహిళ కొద్ది నెలలుగా తాను పిలిచినా పలకడం లేదనే కోపంతో ఓ వ్యక్తి కత్తితో ఆ మహిళపై దాడి చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు, గాయపడ్డ మహిళ బంధువులు తెలిపిన వివరాలు... మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన శానాపతి రమణమ్మ(45) మల్లిపూడి క్వారీల సమీపంలో ఉన్న పొలంలో పని చేస్తున్న అన్నదమ్ములకు బుధవారం మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్తుండగా ఆమెను అనుసరించిన యండపల్లి జగ్గారావు పిలిచి ఇటీవల ఎందుకు తనకు దూరంగా ఉంటున్నావని నిలదీశాడు. దీనిపై స్పందించిన ఆమె తన భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నానని తన మానాన తనను వదిలేయాలని చెప్పి వెళ్లిపోతుండగా జగ్గారావు కత్తితో దాడి చేశాడు. రమణమ్మ మెడ, వీపు, ముఖం, చేతి భాగాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమణమ్మ కేకలు వేయగా స్థానికులు చేరుకుని 108 వాహనం, పోలీసులకు సమాచారమిచ్చారు. రమణమ్మను ఎస్.కోటలోని సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు జగ్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్.కోట ఇన్చార్జి సీఐ లలిత పరిశీలించారు. ఎస్ఐ మారూఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కఠిన శిక్ష పడేలా చూస్తాం : ఎస్పీ రమణమ్మ విషయం తెలుసుకున్న ఎస్పీ జి.పాలరాజు సీహెచ్‌సీకి చేరుకుని ఆమె పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చట్ట ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీనిచ్చారు. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో వెంటపడి!
ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులోని కే-స్టార్ గోడౌన్ యజమాని అన్వర్ తన అనుచరులతో కలిసి లాయర్ అజ్మతుల్లాపై, శివరామి రెడ్డి అనే రైతుపై హత్యాయత్నం చేశాడు. ప్లాన్ ప్రకారం మొదట కారుతో ఢీకొట్టి, ఆపై నిందితులు కత్తులతో వారిద్దరిని నరికి హత్యచేయాలని ప్రయత్నించారు. గోడౌన్ యజమాని, అతడి అనుచరుల దాడిలో అజ్మతుల్లాతో పాటు రైతు శివరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివరామిరెడ్డి పండించిన ధాన్యంతోపాటు వ్యాపార రీత్య కొనుగోలు చేసిన ధాన్యాన్ని శివరామిరెడ్డి ఆత్మకూరు శివారులోని కే -స్టార్ గోదాములో నిల్వ ఉంచేవాడు. అలా నాలుగేళ్ల కిందట గోదాములో ఉంచిన సుమారు కోటి రూపాయల విలువైన ధాన్యాన్ని విక్రయించేందుకు ఆయన 2015లో గోదాముకు వెళ్లగా యజమాని ఎన్ఎస్ అన్వర్ ధాన్యం లేదంటూ ప్లేట్ ఫిరాయించాడు. అప్పటి నుంచి ఆయన కేస్టార్ గోదాము యాజమానయంపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అన్వర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడి ఇద్దరిని హత్య చేయాలని యత్నించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ ఎస్ఐ కూడా సస్పెన్షన్‌కు గురైనట్టు సమాచారం. -
బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది
తణుకు: అంచుకు మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని పూటుగా మద్యం సేవించారు నలుగురు స్నేహితులు. బజ్జీలు బాగుండటంతో ఇంకొన్ని కొనుక్కున్నారు. ఎవరెన్ని పంచుకోవాలనే విషయంలో గొడవపడ్డారు. అదికాస్తా ముదిరిపాకాన పడటంతో బొడ్లో దాచుకున్న కత్తితీసి స్నేహితులపై దాడిచేశాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా పెరసవల్లి మండలం కందవల్లిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరం గ్రామానికి చెందిన మాండు వెంకటేశ్వర్లు(45), భేతాళ రవి(56), నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన పీమా వెంకటేశ్వర్లు(62), ఇందుకూరి రామచంద్రరాజు(46) స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవీరు మంగళవారం జాతీయ రహదారి వద్దనున్న కేఎస్‌రావు వైన్స్‌లో మద్యం సేవించారు. వెళ్తూ వెళ్తూ పక్కనున్న దుకాణంలో బజ్జీలు కొనుక్కున్నారు. బజ్జీల పంపకాల్లో తేడా రావడంతో గొడవ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో మాండు వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో మిగతా ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంకటేశ్వర్లును గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. గాయపడిన ముగ్గుర్నీ తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చిట్టీ డబ్బులు అడిగాడని కత్తితో దాడి
దర్శి (ప్రకాశం): చిట్టీ డబ్బులు అడిగాడని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రియాజ్, మస్తాన్ పాషాలు చికెన్ షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిట్టీ చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మస్తాన్ పాషా, రియాజ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఉరవకొండ ఏఎస్ఐపై కత్తులతో దుండగుల దాడి
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఉరవకొండ ఏస్ఐపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఏఎస్ఐ మహేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భర్తపై కత్తిపీటతో దాడి
కరీంనగర్ : భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య కత్తిపీటతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం, పగడపల్లి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సైదయ్య, రమలు భార్యభర్తలు. మద్యానికి బానిసైన సైదులు ప్రతిరోజు తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. కాగా మంగళవారం సైదయ్య మద్యం తాగి భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దీంతో విసుగెత్తిన రమ కత్తిపీటతో సైదయ్య పై దాడి చేసింది. ఈ దాడిలో సైదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి రమను విచారిస్తున్నారు. (కాల్వశ్రీరాంపూర్) -
ఇంజినీరింగ్ విద్యార్థికి కత్తిపోట్లు
మొయినాబాద్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్ విద్యార్థిపై అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్(20) మండలంలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన జయరాంరెడ్డి(22) అదే కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అరుణ్‌కుమార్ తల్లి మొయినాబాద్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం అరుణ్‌కుమార్ మొయినాబాద్ బస్టాపులో తన తల్లికోసం వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన జయరాంరెడ్డి అతణ్ని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. స్థానికులు కలుగజేసుకుని ఇద్దర్ని అక్కడినుంచి పంపించేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో అరుణ్‌కుమార్‌కు జయరాంరెడ్డి ఫోన్‌చేసి గొడవ విషయం మాట్లాడుకుని రాజీ అవుదామని మొయినాబాద్‌కు పిలిపించాడు. జయరాంరెడ్డి తన స్నేహితులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సాయి, వినాయక్‌రెడ్డి, ఓంరెడ్డితో కలిసి హోటల్ పక్కన ఉన్న గల్లీలోకి అరుణ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. అక్కడ ఒక్కసారిగా అరుణ్‌కుమార్‌ని జయరాంరెడ్డి కత్తితో కడుపులో పొడిచాడు. మరోసారి పొడిచేందుకు యత్నించగా అది అరుణ్‌కుమార్ ఎడమచేతికి తగిలింది. అనంతరం వారంతా అక్కడినుంచి పరారవగా అరుణ్‌కుమార్ మొయినాబాద్‌లో ఉండే తన స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లాడు. వెంటనే సురేష్ ‘108’కు, పోలీసులకు సమచారం అందించి స్థానికుల సహాయంతో బాధితుణ్ని షాదన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ర్యాలీ... బీటెక్ విద్యార్థి అరుణ్‌కుమార్‌పై దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మొయినాబాద్‌లో ఉన్న అరుణ్‌కుమార్ స్నేహితులు, స్థానికులు కలిసి మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐ రవిచంద్రను కోరారు. పాతకక్షల నేపథ్యంలోనే విద్యార్థిపై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జయరాంరెడ్డిని కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది.