![HYD: Man Attacked With A Knife For Asking Money To Water - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/17/attack.jpg.webp?itok=zEtUcAiW)
గాయపడిన వ్యాపారి జబ్బార్
సాక్షి, సైదాబాద్: మినరల్ వాటర్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ రహదారిపై అబ్దుల్ జబ్బార్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఖాలేద్ అనే యువకుడు ప్లాంట్‌కు వచ్చి నీళ్లు తీసుకున్నాడు. డబ్బులు అడుగడంతో తాను సైదాబాద్ డాన్ అని వాగ్వాదానికి దిగాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యాపారిపై కత్తి, నక్కల్ పంచ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన జబ్బార్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని
Comments
Please login to add a commentAdd a comment