![Guntur: Uncle And Brother In Attacked Son In Law With A Knife - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/9/Nife.jpg.webp?itok=mxOdfXat)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి గాయపరిచిన ఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మలచేరువులో చోటుచేసుకుంది. వివరాలు.. దూదేకుల చిన్న కాశిం ఇటీవల చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు. చెడు వ్యసనాలను మానుకోవాలని భార్య కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతనిలో మార్పు రాలేదు.
చదవండి: ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
కొన్ని రోజుల నుంచి భార్యపై చిన్న కాశిం వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయమై చిన్న కాశింను అతని మామ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో చిన్న కాశింపై అతని మామ, బావ మరిది కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్న కాశింను చికిత్స కోసం పిడుగురాళ్ల ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు . మామా పిరు సాహెబ్, బావ మరిది భాషాలను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment