మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్‌ కిడ్నాప్‌ | Madhya Pradesh Village Sarpanch Abducted Over Grandson Marriage Issue | Sakshi

మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్‌ కిడ్నాప్‌

Jun 25 2021 10:34 AM | Updated on Jun 25 2021 11:23 AM

Madhya Pradesh Village Sarpanch Abducted Over Grandson Marriage Issue - Sakshi

సర్పంచ్‌ బద్రిలాల్‌ను కిడ్నాప్‌ చేస్తున్న దృశ్యం (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే)

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సినిమాను తలదన్నే రీతిలో ఓ సర్పంచ్‌ కిడ్నాప్‌ చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కాస్త చివరకు సర్పంచ్‌ కిడ్నాప్‌కు దారి తీసింది. ఆ వివరాలు.. స్థానిక సంప్రదాయం ప్రకారం దియాలి గ్రామ సర్పంచ్‌ బద్రిలాల్‌ మనవడి వివాహం బాలాగంజ్‌ ప్రాంతానికి చెందిన యువతితో బాల్యంలోనే నిశ్చయమయ్యింది. ప్రస్తుతం ఇద్దరికి యుక్తవయసు వచ్చింది.. చిన్నప్పుడు నిశ్చయించిన ప్రకారం యువతిని తమ ఇంటికి పంపాల్సిందిగా బద్రిలాల్‌ ఆమె కుటుంబ సభ్యులును కోరాడు. కానీ వారు నిరాకరించడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఇరు కుటుంబాల పెద్దలు గ్రామంలోని అంతారి ఆలయంలో సమావేశమయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు సమస్య గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. చివరకు చర్చలు కాస్త ముదిరి.. ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఎవరింటికి వారు వెళ్లారు. ఇక మరుసటి రోజు ఇంటి నుంచి బయటకు వచ్చిన బద్రిలాల్‌ను యువతి కుటుంబ సభ్యులు అపహరించారు. విషయం తెలుసుకున్న బద్రిలాల్‌ గ్రామస్తులు యువతి కుటుంబం మీదకు గొడవకు వెళ్లారు. అక్కడ వీరంగం సృష్టించి.. యువతి ఇంటిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

చదవండి: విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement