
ప్రతీకాత్మక చిత్రం
అనంతపురం క్రైం: నగర శివారులోని వనమిత్రలో ఆదివారం ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉప్పరపల్లికి చెందిన ఇటుక బట్టీల నిర్వాహకుడు వెంకటస్వామి, శివమ్మ దంపతుల కుమారుడు గురుమూర్తికి మూడేళ్ల క్రితం ప్రసన్నాయపల్లికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. గురుమూర్తి పంగల్ రోడ్డులోని ధాబాకు వెళుతున్న క్రమంలో అక్కడ పనిచేస్తున్న చిన్నకుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుమార్తె సాయిలీలతో పరిచయమైంది.
చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే?
అయితే ఏడాది క్రితమే సాయిలీలకు ముదిగుబ్బ మండలం బాల్యానాయక్ తండాకు చెందిన యువకుడితో వివాహమైంది. భర్తతో సఖ్యతగా ఉండలేక ఆమె ఆరు నెలలుగా తల్లి వద్దనే ఉంటోంది. సాయిలీల, గురుమూర్తి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆదివారం సాయంత్రం వనమిత్రకు చేరుకుని క్రిమి సంహారక మందు తాగారు. విషయం తెలుసుకున్న గురుమూర్తి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది.. సాయిలీలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సీఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ గౌస్‌బాషా దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment