
యశవంతపుర(కర్ణాటక): హైస్కూల్లో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి మరో ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగున్ని భట్కళ గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. భట్కళ తాలూకా చిత్రాపుర ఒడ్డుకుళికి చెందిన అక్షయ మంజునాథ నాయక్(23) రెండు రోజుల క్రితం హైస్కూల్‌లో చదువుతున్న బాలికను బెంగళూరుకు తీసుకొచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు నగరానికి వచ్చి గాలింపు చేపట్టి నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
చదవండి:
సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం
కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ..
Comments
Please login to add a commentAdd a comment