
ప్రతీకాత్మక చిత్రం
టీ.నగర్: చెన్నైలోని వస్త్ర దుకాణంలో మహిళా ఉద్యోగిని హతమార్చిన యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుపోరూరు నుంచి మాంబాక్కం వెళ్లే మార్గంలో కాయార్ అటవీ ప్రాంతంలో ఈ నెల 17న ఓ మహిళ హత్యకు గురైంది. మహాబలిపురం డీఎస్పీ గుణశేఖరన్ విచారణ జరిపారు. ఆమె చెన్నైలోని ప్రముఖ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న కోవిలంబాక్కంకు చెందిన చంద్ర(30)గా గుర్తించారు. ఆమెను హతమార్చిన నన్మంగళంకు చెందిన పెయింటర్ దినేష్‌బాబు (36)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
దినేష్‌బాబుతో చంద్ర భర్త మణికంఠన్ పెయింటింగ్ పనిచేసేవాడు. ఈ క్రమంలో చంద్రతో దినేష్ బాబుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మణికంఠన్‌ను విడిచి తనతో వచ్చేయమని దినేష్ బాబు ఆమెను కోరాడు. ఆమె సమ్మతించకపోవడంతో ఈ నెల 17న తిరుపోరూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసులు దినేష్ బాబును చెంగల్పట్టు కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలులో నిర్బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment