
సాక్షి, నల్గొండ : ప్రేమ పేరుతో కొత్త రకం వేధింపులకు దిగాడో వ్యక్తి. తన ప్రేమను ఒప్పుకోక పోవడంతో చేతబడి పేరుతో బెదిరింపులు మొదలుపెట్టాడు. నల్గొండకు చెందిన కూడతల మురళి అనే వ్యక్తి ఓ పెళ్లైన యువతిని ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ ఆమెపై వేధింపులకు దిగాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
యూట్యూబ్, ఫేస్ బుక్‌లో చూసి చేతబడి నేర్చుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి అత్తారింటి ముందు చేతబడి పూజలు నిర్వహించాడు. చేతబడికి భయపడి అమ్మాయి అత్తింటి వాళ్లు ఆమెను వదిలేస్తారని భావించాడు. అయితే అలా జరగలేదు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మురళిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment