నిత్య పెళ్లికొడుకు: మోసం చేశారని ఒకరు.. విడిచి పెట్టాలని ఒకరు | Nalgonda Crime News: A Man Cheats Women in the Name of Marriage | Sakshi
Sakshi News home page

నిత్య పెళ్లికొడుకు: మోసం చేశారని ఒకరు.. విడిచి పెట్టాలని ఒకరు

Published Thu, Nov 11 2021 4:13 PM | Last Updated on Fri, Nov 12 2021 3:27 PM

Man who trapped Women, Someone Who Requests SP To Leave Him - Sakshi

నల్లగొండ క్రైం : నిత్య పెళ్లికొడుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టణానికి చెందిన తలకొప్పుల విలియమ్స్‌పై సహజీవనం చేసిన మహిళ న్యాయం చేయాలని, ఇటీవల వివాహం చేసుకున్న మరో యువతి తన భర్తను విడిచిపెట్టాలని  నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది.  జిల్లా కేంద్రంలోని బీటీఎస్‌కు చెందిన తనూజ తనతో విలియమ్స్‌ సహజీవనం సాగించి అందరికీ భార్యగా పరిచయం చేసి మోసగించాడని ఇప్పటికే పోలీసులతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల విలియమ్స్‌ను వివాహం చేసుకున్న మునుగోడుకు చెందిన బొల్లం వెంకన్న –సైదమ్మల కుమార్తె శ్రీలత, ఆమె తల్లిదండ్రులు బుధవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

అయితే, శ్రీలత తన అమాయకుడని, విడిచిపెట్టాలని ఎస్పీని వేడుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో శ్రీలత తల్లిదండ్రులు సైతం ఎస్పీని కలిసి తమ బిడ్డను విలియమ్స్‌ మోసగించి పెళ్లి చేసుకున్నాడని, మైనారిటీ కూడా తీరలేదని వాపోయినట్లు సమాచారం. అనంతరం కూతురుని తమ వెంట తీసుకెళ్లేందుకు కాళ్ల మీద పడినట్లు తెలిసింది. అందుకు శ్రీలత తాను మేజర్‌నని, విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాను అతడితో ఉంటానని తెగేసి చెప్పినట్లు తెలియవచ్చింది. కాగా, అందరి వాదనలు విన్న తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్తామని వారికి ఎస్పీ రంగనాథ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

చదవండి: Nalgonda: నిత్యపెళ్లి కొడుకు.. 19 మంది మహిళలను మోసం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement