
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబై గోరేగావ్‌లో ఓ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘటనలో 40 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.
ఎంజీ రోడ్డులోని ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని హెబీటీ, కూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
मुंबई के गोरेगांव में देर रात लगी भयंकर आग, 7 की मौत लगभग 45 लोग घायल। #fire#Mumbai #goregaon pic.twitter.com/d6q6iGAMjY
— saket rai (@Saketrai2000) October 6, 2023
Comments
Please login to add a commentAdd a comment