MG Road
-
ముంబైలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఏడుగురి దుర్మరణం
ముంబై: మహారాష్ట్ర రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబై గోరేగావ్‌లో ఓ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘటనలో 40 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ఎంజీ రోడ్డులోని ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని హెబీటీ, కూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. मुंबई के गोरेगांव में देर रात लगी भयंकर आग, 7 की मौत लगभग 45 लोग घायल। #fire#Mumbai #goregaon pic.twitter.com/d6q6iGAMjY — saket rai (@Saketrai2000) October 6, 2023 -
సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: 75 ఏళ్ల భారత స్వాతంత్ర సమరోత్సవాన్ని పురస్కరించుకొని.. అప్పటి మహా సంగ్రామ సమయంలో హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్న అద్భుత ఘట్టాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ మొదటిసారి నగరంలో పర్యటించిన సందర్భానికి ప్రత్యేక విశేషముంది. 1929 ఏప్రిల్ 7వ తేదీన గాంధీ మొదటిసారి నగరానికి విచ్చేశారు. ఆ రోజు జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగిన గాంధీజీ. అక్కడి నుంచి సుల్తాన్ బజార్ చేరుకున్నారు. ఈ సందర్భానికి గుర్తుగా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత జేమ్స్ స్ట్రీట్‌కు ఎంజీ (మహాత్మా గాంధీ) రోడ్డుగా నామకరణం చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో నివాసమున్న జేమ్స్ కిర్క్‌పాట్రిక్ పేరు మీద ఆ వీధిని జేమ్స్ స్ట్రీట్‌గా పిలిచారు. వ్యాపారానికి కేంద్రం ప్రస్తుత ఎంజీ రోడ్డు జేమ్స్ స్ట్రీట్‌గా పిలువబడుతున్నప్పటి నుంచే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జేమ్స్ స్ట్రీట్ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్తక వ్యాపారాలకు చెందిన పెద్ద షాప్‌లు దర్శనమిస్తాయి. దాదాపు 150 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గోల్డ్ మార్కెట్ అభివృద్ధి చెందుతూ వస్తుంది. జనరల్ బజార్, క్లాత్ మార్కెట్‌కు ఎంజీ రోడ్డు మీదుగానే చేరుకునేవారు. ఇక్కడి వస్త్ర వ్యాపారం గురుంచి తెలుసుకున్న మహాత్మా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. దేశంలోని వస్త్ర వ్యాపారానికి హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు ప్రత్యేక కేంద్రాలని కొనియాడారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాహనాలు ఎంజీ రోడ్ మీదుగానే ప్రయాణిస్తాయి. నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, రాణీ గంజ్ బస్ డిపో, జూబ్లీ బస్టాండ్లకు మధ్య వారధిగా కూడా ఎంజీ రోడ్ ఉంటుంది. ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించిన మలానీ భవనం కూడా ఎంజీ రోడ్లోనే ఉంది. ఈ భవనాన్ని నిర్మించిన దేవాన్ బహదూర్ రాంగోపాల్ మలానీ పోలీసు శాఖకు విరాళంగా ఇవ్వగా..ఈ భవనం పోలీస్ స్టేషన్‌గా మారింది. ఇక్కడే ఉన్న గడియారాన్ని 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ విగ్రహం.. ఎంతో ప్రత్యేకం.. ప్రస్తుతం ఎంజీ రోడ్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్యారడైజ్ బిర్యానీ రెస్టారెంట్ స్థానంలో ప్యారడైజ్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ యజమాని తొడుపునూరి అంజయ్య గౌడ్ గాంధీజీ పర్యటనకు గుర్తుగా అప్పట్లోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని విరాళంగా అందించారు. 1951లో ఈ విషయం తెలుసుకున్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో ప్రత్యేకంగా ఇటలీలో తయారు చేయించారని సమాచారం. 70 ఏళ్లుగా ఈ విగ్రహం ఎంజీ రోడ్డులో అందరికీ కనిపిస్తుంది. ఈ గాంధీ సర్కిల్‌కు ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులను చేపట్టారు. -
బెంగళూరులో మళ్లీ కీచకపర్వం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మళ్లీ కీచకపర్వం కొనసాగింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో యువకులు విచక్షణ మరిచిపోయారు. గతేడాది మాదిరే ఈ సారి కూడా యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది బెంగళూరులో యువతులపై పెద్ద ఎత్తున లైంగిక వేధింపులు జరగడం, దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి బెంగళూరు నడిబొడ్డున ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులో పెద్ద ఎత్తున యువతీయువకులు చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఇళ్లకు తిరిగివెళ్లే సమయంలో తాగిన మత్తులో కొంతమంది యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి కాళ్లు పట్టించిన ఖాకీలు విదేశీ వనితను అదేపనిగా తాకేందుకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకుని ఆ యువతికి క్షమాపణ చెప్పాలని కోరారు. మొదట నిరాకరించిన యువకుడు, అటుపై క్రిమినల్ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో యువతి కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. మరో ఘటనలో భర్త ఎదురుగానే అతడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగలేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మద్యం మత్తులో కొంతమంది మాత్రం దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. -
లోకల్ పాండీ బజార్
♦ వ్యాపార, వైద్య సేవలకు ప్రసిద్ధి ఎంజీ రోడ్ ♦ అన్ని రకాల వస్తువులూ ఇక్కడ దొరుకుతాయి ♦ రోజూ కోట్ల రూపాయల్లో వాణిజ్య లావాదేవీలు కొత్తగూడెం: కొత్తగూడెంలోని ఎంజీ రోడ్డు, గణేష్ టెంపుల్ ఏరియా..కొత్తగూడెం కా ‘పాండీ బజార్’గా విరాజిల్లుతోంది. రైల్వేస్టేషన్ ప్రారంభం నుంచి గణేష్ టెంపుల్ ఏరియా దాటుకుని ముర్రేడువాగు బ్రిడ్జి ప్రారంభం వరకు వస్త్ర దుకాణాలకు, ఆస్పత్రులకు ప్రసిద్ధి. వివిధ రకాల దుకాణాలు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నాయి. నిత్యం వేలమందితో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. రోజూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వస్త్ర దుకాణాలకు ప్రసిద్ధి రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వస్త్ర, వ్యాపార సంస్థలన్నీ కొత్తగూడెంలోని ఎంజీ రోడ్డులో విస్తరించి ఉన్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా క్లాత్ అండ్ రెడీమేడ్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల ప్రారంభోత్సవానికి సైతం ప్రముఖ సినీ నటీమణులు విచ్చేసి జిల్లా ప్రజలను ఆకట్టుకున్నారు. వీటితోపాటు జాతీయ రహదారికి వెనుక పక్కన చిన్న, పెద్ద బజార్లలో అనేక నిత్యావసర వ్యాపారాలు జరుగుతుంటాయి. సిమెంట్, ఐరన్, కిరాణ, ప్లాస్టిక్, ఫ్రూట్, ఫ్యాషన్ తదితర వ్యాపారాలు ఒకే చోట కేంద్రీకృతమయ్యాయి. దీంతో నిత్యం వినియోగదారులతో, జిల్లా వాసులతో ఈ బజారు కళకళలాడుతుంది. ఎమర్జెన్సీ వైద్యానికి కేంద్రం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎమర్జెన్సీ వైద్యానికి కేంద్రంగా మారింది గణేష్ టెంపుల్ ఏరియా. అన్ని విభాగాల వైద్యుల ఆస్పత్రులన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఆస్పత్రులు, మెడికల్ దుకాణాలు, ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎమర్జెన్సీ సదుపాయాలు, మెడికల్ సామగ్రిని సైతం వైద్యులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. స్పెషలైజ్డ్ ఎమర్జెన్సీ సేవలను సైతం జిల్లా ప్రజల ముంగిటకు చేరుస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు ఎమర్జెన్సీ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఇటీవల తగ్గాయి. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ప్రముఖ సెల్, ఇతర అన్ని రకాల దుకా ణాలు కూడా ఉన్నాయి. ఇక పండుగ రోజుల్లో ఈ వీధి జాతరను తలపిస్తుంది. దీపావళి, వినాయక చవితి తదితర పండగ సమయాల్లో పూజ సామగ్రి ఇక్కడే విక్రయిస్తుంటారు. హోటల్స్, సినిమా థియేటర్లకు నెలవు ఇతర ప్రాంతాల నుంచి కొత్తగూడేనికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు బసచేసేందుకు కావాల్సిన హోట ల్స్ 7హిల్స్ నుంచి మొదలుకొని గణేష్టెంపుల్ ఏరి యా వరకు నెలకొని ఉన్నాయి. ఒక్కసారి ఎంజీ రోడ్ కు వస్తే అవసరమైన వస్తువులన్నీ కొనుగోలు చేసుకునే వీలుఉంటుంది. ఒక్కోవస్తువు కోసం ఒక్కో బజా ర్కు వెళ్లే అవసరం లేకుండా ప్రతీ ఒక్కటి ఇక్కడే లభి స్తుండటం విశేషం. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా థియేటర్లు ప్రధాన రహదారి వెంబడి ఉన్నాయి. కూలీలకు అడ్డా... గణేష్ టెంపుల్: రోజువారీ కూలీలకు గణేష్ టెంపుల్ సెంటర్ అడ్డాగా ఉంది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే వివిధ రకా ల కార్మికులు కొత్తగూడెం సమీప ప్రాంతాల నుంచి రోజూ ఉదయమే వందల సంఖ్యలో చేరుకుని కూలీ పనుల కోసం ఎదురుచూస్తుంటారు. కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ మేస్త్రీలు ఈ అడ్డాలో ఉండే కార్మికులను ప్రతిరోజు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుండటం విశేషం. 50 ఏళ్లుగా వ్యాపారంలో.. కొత్తగూడెంలో 50 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తున్నాం. గతంలో క్లాత్, ప్రస్తుతం రెడిమేడ్ వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నాం. వినియోగదారులకు మారుతున్న అభిరుచులకు తగ్గట్లుగా వస్త్రాలను అందించగలుగుతున్నాం. తరతరాలుగా వినియోగదారుల ఆదరణ ఉంది. –భవాని ప్రసాద్, వస్త్ర వ్యాపార యజమాని -
‘రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయమేస్తోంది’
సాక్షి, బెంగళూరు: పాశ్చాత్య దుస్తులు వేసుకుంటే దాడులు చేస్తారా?, ఆ హక్కు ఎవరు ఇచ్చారు?, చీరకట్టుకునే మహిళలు, చిన్నపిల్లలు ఏంచేశారు... వారి మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు, ఇదేం సంస్కృతి... అని మహిళా లోకం ఆవేదన చెందుతోంది. న్యూ ఇయర్ సంబరాల్లో బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, అలాగే కమ్మనహళ్లిలో యువతిపై నడివీధిలోనే కీచక పర్వాలతో యావత్ మహిళా ప్రపంచం దిగ్భ్రమకు లోనైంది. కళ్లముందే జరుగుతున్న ఘోరాలు, సాక్ష్యాధారాలతో సహా నీచ అకృత్యాలు బయటపడుతుంటే నిశ్చేష్టులవుతున్నారు. కొందరు మృగాళ్ల వల్ల స్త్రీలందరూ రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతోంది. తోడేళ్లలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని, అప్పుడే మిగతావారికి గుణపాఠమవుతుందని మహిళలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నేటి సమాజంలో బయటకు వెళ్లిన మహిళలు సురక్షితంగా ఇంటికి తిరిగిరావడం కలగా మారిందని వాపోయారు. పురుషుల మైండ్‌సెట్ మారాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని వారు ఆరోపించారు. తాజా లైంగిక వేధింపుల ఘటనలపై మహిళలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం... చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు... యువతులపై అత్యాచారాలకు పాశ్చాత్య సంస్కృతికి చెందిన దుస్తులు ధరించడమే కారణమైతే అటువంటి దుస్తులను తయారు చేస్తున్న సంస్థలను నిషేధించాలి. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలపై జరిగిన ఘటనలను తెరమరుగు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త సంవత్సర వేడుకులకు అన్ని భద్రత చర్యలు తీసుకున్నామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం జరిగిన ఘటనల్లో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – సీమా బీ.ఆర్. సాఫ్ట్వేర్ ఉద్యోగి, కృష్ణరాజపుర తల్లిదండ్రులు భయపడుతున్నారు మహిళలపై లైంగికదాడులు పదే పదే పునరావృతం అవుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డిసెంబర్ 31రాత్రి బెంగళూరులో ఆ యువతిపై యువకులు ప్రవర్తించిన తీరు హేయం. కఠినమైన చట్టాలు అమలు చేయకపోవడం వల్లే కీచకులు బరి తెగిస్తున్నారు. దీంతో అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. – కే.భావన, పీయూసీ విద్యార్థిని, బళ్లారి హోం మంత్రి వ్యాఖ్యలు బాధాకరం పురుషులతో సమానంగా ఎదగాలంటే చదువు ఎంతో ముఖ్యం. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం వల్ల అమ్మాయిలను పైచదువులకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. బెంగళూరు ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. – శాంభవి, పీయూసీ సెకెండ్ ఇయర్, బళ్లారి మృగాల మధ్య ఉన్నట్లుంది ‘కొత్త సంవత్సరం రోజున నగరంలో యువతులపై జరిగిన లైంగిక దాడుల ఘటనలు చూస్తుంటే మనుషుల మధ్య ఉన్నామా లేక మృగాల మధ్య ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులు,అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణకు రాత్రివేళల్లో పోలీసులు గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది’. – రాధా, విద్యార్థిని, యలహంక దోషులను కఠినంగా శిక్షించాలి యువతులపై మాత్రమే కాదు మహిళలు, చివరికి పాఠశాలకు వెళుతున్న చిన్నారులపై కూడా పైశాచికంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘటనల్లో నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలి. – రత్నమ్మ,దళిత సంఘర్ష సమితి ప్రధాన కన్వీనర్, కృష్ణరాజపుర జాగ్రత్తగా ఉండాలి మహిళలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా కళాశాల అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరులాంటి మహా నగరాల్లో ఇలాంటి దారుణాలు జరగడం అధికారులకు, రాజకీయ నాయకులకు అప్రతిష్ట. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలి. – బీ.ఎం. సింధూ .(న్యాయవాది, తుమకూరు) అప్రమత్తతే ఉత్తమం మహిళలు బయటకు వెళ్లే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. – రమా కుమారి, ( జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు, తుమకూరు) -
ఆగ్రాలో రోడ్డు ప్రమాదం.. పాల్వంచ విద్యార్థి దుర్మరణం
పాల్వంచ రూరల్: ఆగ్రాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఒడ్డుగూడేనికి చెందిన ఎస్కె.ఖాదర్ (23) దుర్మరణం చెందాడు. అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండియర్ చదువుతున్న అతడు ఫోన్ రీచార్జ్ చేయించుకునేందుకు తన క్యాంపస్ నుంచి స్నేహితుడితో కలసి బయటకు వచ్చాడు. రాజ్కామండీ ఎంజీరోడ్ మీదుగా వెళ్తుండగా వేగంగా వచ్చి న భారీ వాహనం ఖాదర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని స్నేహితుడు పాల్వంచలోని అతడి తమ్ముడు అల్లాబక్షికి ఫోన్ చేసి తెలిపాడు. మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత కూడా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఆగ్రాలోని యూనివర్సిటీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఖాదర్ మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శుక్రవారం పాల్వంచకు చేర్చేవిధంగా ఏర్పాట్లు చేశారు. -
రియాల్టీకి ఊపుతెచ్చిన ర్యాపిడ్ మెట్రో
గుర్గావ్: జాతీయరాజధానితో గుర్గావ్ను అనుసంధానించే ర్యాపిడ్ మెట్రో మార్గం మరోమారు రియల్ వ్యాపారానికి ఊపుతెచ్చింది. గుర్గావ్లోని ఎంజీ రోడ్డు, డీఎల్ఎఫ్ పేజ్-2, ఫేజ్-3, ఎంజీ రోడ్డు వాసులకు రవాణా సుగమమైంది. డీఎల్ఎఫ్ సైబర్ సీటీకి వ్యాపార స్థలాలకు డిమాండ్ పెరిగింది. 2010లో ర్యాపిడ్ మెట్రో నిర్మాణం ప్రారంభమవడంతోనే ఎంజీ రోడ్డు, డీఎల్ఎఫ్లలో ఆస్తుల విలువ 35 నుంచి 100 శాతం పెరిగింది. ర్యాపిడ్ మెట్రో మార్గంలో ఉన్న బెల్వెదెర్ టవర్స్‌లో చదరపు అడుగు ఏడు వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం ర్యాపిడ్ మెట్రో ప్రారంభం కావడంతో ధర చదరపు అడుగు 13,500 రూపాయలకు ఎగబాకింది. బెల్వెదర్ పార్కు, గార్డెన్ ఎస్టేట్లలోనూ ధరలు ఇదే స్థాయిలో పెరిగాయని కుష్మన్ వేక్ఫీల్డ్ సంస్థల కన్సల్టెంట్ తెలిపారు. డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో కార్యాలయాల అద్దెలు గత మూడు సంవత్సరాల్లో 40 శాతం పెరిగాయి. ఇప్పుడు మెట్రోతో అనుసంధానమైన తరువాత చదరపు అడుగు అద్దె రూ. 80 నుంచి 140 వరకు పెరిగాయని స్థిరాస్తి వ్యాపార కన్సల్టెంట్ అక్సీయన్ తెలిపింది. సీ అండ్ డబ్ల్యూ కన్సల్టెంట్ మాట్లాడుతూ ర్యాపిడ్ మెట్రో ఈ ప్రాంతంలోని కార్యాలయాలకు రవాణా సదుపాయమే కాకుండా అనేక రకాలుగా మిగులు సమకూర్చింది. నిర్వహణ ఖర్చులు తగ్గడం వలన ఈ సదుపాయం సమకూరింది. సైబర్ సిటీ తన ఉద్యోగులకు మెట్రో ట్రావెల్ కార్డులు ఇవ్వడం ద్వారా రవాణా మీద ఒక్కొక ఉద్యోగిపై 2,500 నుంచి 3,000 రూపాయలను ఆదా చేసుకుంటోంది. దీని ప్రకారం ఒక వర్క్ స్టేషన్ చదరపు గజానికి రూ. 20 తగ్గుతున్నట్లులెక్క. ఇది ఈ వాణిజ్య సముదాయాలకు మరింత లబ్ది చేకూరుస్తుంది. అక్సియన్ లాండ్బేస్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సీనియర్ బ్రోకర్ రాజేశ్ షరాఫ్ మాట్లాడుతూ‘‘ర్యాపిడ్ మెట్రో మార్గానికి అనుకుని ఉన్న ప్రాంతంలో ఆస్తులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. కొత్త రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో ఇక మీదట ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ గొడవ ఉండదు. ఇక ఢిల్లీ మెట్రోతో అనుసంధానం మరింత అదనపు ఆకర్షణ అని వివరించారు. 5.1 ఒక కిలోమీటరు పొడవున విస్తరించి ఉన్న ర్యాపిడ్ మెట్రో మార్గాన్ని రోజుకు 50 వేల మంది వినియోగించుకుంటారని నిపుణుల అంచనా. ఈ మార్గంలో ఉన్న ఆరు స్టేషన్లు సైబర్ సిటీ, సికిందర్పూర్ల మధ్యనే ఉన్నాయి. ఇది రియల్ వ్యాపారానికి మరింత కలిసివచ్చే అంశం.