గుర్గావ్: జాతీయరాజధానితో గుర్గావ్‌ను అనుసంధానించే ర్యాపిడ్ మెట్రో మార్గం మరోమారు రియల్ వ్యాపారానికి ఊపుతెచ్చింది. గుర్గావ్‌లోని ఎంజీ రోడ్డు, డీఎల్‌ఎఫ్ పేజ్-2, ఫేజ్-3, ఎంజీ రోడ్డు వాసులకు రవాణా సుగమమైంది. డీఎల్‌ఎఫ్ సైబర్ సీటీకి వ్యాపార స్థలాలకు డిమాండ్ పెరిగింది.
2010లో ర్యాపిడ్ మెట్రో నిర్మాణం ప్రారంభమవడంతోనే ఎంజీ రోడ్డు, డీఎల్‌ఎఫ్‌లలో ఆస్తుల విలువ 35 నుంచి 100 శాతం పెరిగింది. ర్యాపిడ్ మెట్రో మార్గంలో ఉన్న బెల్‌వెదెర్ టవర్స్‌లో చదరపు అడుగు ఏడు వేల రూపాయలు పలికింది. ప్రస్తుతం ర్యాపిడ్ మెట్రో ప్రారంభం కావడంతో ధర చదరపు అడుగు 13,500 రూపాయలకు ఎగబాకింది. బెల్‌వెదర్ పార్కు, గార్డెన్ ఎస్టేట్‌లలోనూ ధరలు ఇదే స్థాయిలో పెరిగాయని కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ సంస్థల కన్సల్టెంట్ తెలిపారు.
డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో కార్యాలయాల అద్దెలు గత మూడు సంవత్సరాల్లో 40 శాతం పెరిగాయి. ఇప్పుడు మెట్రోతో అనుసంధానమైన తరువాత చదరపు అడుగు అద్దె రూ. 80 నుంచి 140 వరకు పెరిగాయని స్థిరాస్తి వ్యాపార కన్సల్టెంట్ అక్సీయన్ తెలిపింది.
సీ అండ్ డబ్ల్యూ కన్సల్టెంట్ మాట్లాడుతూ ర్యాపిడ్ మెట్రో ఈ ప్రాంతంలోని కార్యాలయాలకు రవాణా సదుపాయమే కాకుండా అనేక రకాలుగా మిగులు సమకూర్చింది. నిర్వహణ ఖర్చులు తగ్గడం వలన ఈ సదుపాయం సమకూరింది. సైబర్ సిటీ తన ఉద్యోగులకు మెట్రో ట్రావెల్ కార్డులు ఇవ్వడం ద్వారా రవాణా మీద ఒక్కొక ఉద్యోగిపై 2,500 నుంచి 3,000 రూపాయలను ఆదా చేసుకుంటోంది. దీని ప్రకారం ఒక వర్క్ స్టేషన్ చదరపు గజానికి రూ. 20 తగ్గుతున్నట్లులెక్క. ఇది ఈ వాణిజ్య సముదాయాలకు మరింత లబ్ది చేకూరుస్తుంది.
అక్సియన్ లాండ్‌బేస్ ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సీనియర్ బ్రోకర్ రాజేశ్ షరాఫ్ మాట్లాడుతూ‘‘ర్యాపిడ్ మెట్రో మార్గానికి అనుకుని ఉన్న ప్రాంతంలో ఆస్తులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. కొత్త రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో ఇక మీదట ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ గొడవ ఉండదు. ఇక ఢిల్లీ మెట్రోతో అనుసంధానం మరింత అదనపు ఆకర్షణ అని వివరించారు. 5.1 ఒక కిలోమీటరు పొడవున విస్తరించి ఉన్న ర్యాపిడ్ మెట్రో మార్గాన్ని రోజుకు 50 వేల మంది వినియోగించుకుంటారని నిపుణుల అంచనా. ఈ మార్గంలో ఉన్న ఆరు స్టేషన్లు సైబర్ సిటీ, సికిందర్‌పూర్‌ల మధ్యనే ఉన్నాయి. ఇది రియల్ వ్యాపారానికి మరింత కలిసివచ్చే అంశం.
రియాల్టీకి ఊపుతెచ్చిన ర్యాపిడ్ మెట్రో
Published Sat, Nov 16 2013 3:32 AM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM
Advertisement
Advertisement